మౌలిక వసతులూ మృగ్యం
ప్రయాణికులకు తప్పని అసౌకర్యాలు
రూ.2.50 కోట్ల పనుల్లో నాణ్యత కరువు
ప్రజాశక్తి-రాయచోటి : జిల్లా కేంద్రమైన రాయచోటిలో ఆర్‌టిసి బస్టాండ్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో పనులు ప్రారంభించారు. నెలలు గుడుస్తున్నా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. జిల్లా కేంద్రమైనప్పటికీ ఆర్‌టిసి సేవలు అధ్వానంగా ఉన్నాయి. బస్టాండ్ ప్రాంత మంతా దుర్గందభరితంగా తయారైంది. బస్టాండ్‌లో ప్రయాణికులు కూర్చునేందుకు కనీసం సరైన కుర్చీలు కూడా లేవు. మరుగుదొడ్లు కూడా సరిగా లేవు. రూ.2.50 కోట్ల నిధులతో బస్టాండ్‌కు మరమ్మతులు చేపట్టాలని పనులు ప్రారంభించారు. ప్రస్తుతం 9 ప్లాట్ ఫామ్‌లో ఉన్నాయి. అదనంగా మరో 5 ప్లాట్ ఫామ్‌లను పెంచారు. ప్రహరీ గోడను పగలగొట్టి నిర్మాణ పనులు చేపట్టారు. బస్సు వచ్చిందంటే జనాలు ఒకరినొకరు తోసుకుంటూ సీట్ల కోసం పోటీ పడాల్సిన పరిస్థితి ఉంది. రాయచోటి నుండి ప్రతి రోజూ తిరుపతి, మదనపల్లి పీలేరు, చిత్తూరు, కడప, బెంగళూరు వంటి ప్రాంతాలకు నిత్యం వ్యాపారులు, విద్యార్థులు, ప్రయాణికులు భారీ సంఖ్యలో ప్రయాణిస్తుంటారు. బస్టాండ్ ప్రాంతం అంతా కూడా సౌకర్యాలతో కొట్టుమిట్టాడుతుంది. గతంలో గ్రామీణ ప్రాంతాలకు కూడా బస్సు సౌకర్యాలు ఉండేవి. కొంతకాలంగా గ్రామీణ సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు వచ్చినప్పుడు ఒక్కసారిగా దుమ్ము పైకి లేచి ప్రయాణికులకు ఇబ్బంది కలిగే విధంగా బస్టాండ్ ప్రాంతం ఉంటుంది. సిసి రోడ్లు లేక దుమ్ముతో నిండుకొంది. వేసవికాలంలో ప్రయాణికులు తాగునీటి కోసం నానా తిప్పలు పడాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఓ దాత ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన జల్ మందిర్‌ను కూడా కొత్త బస్టాండ్ ఆవరణ నిర్మాణంతో వాటిని తొలగించారు. మలమూత్ర విసర్జనకు కూడా సరైన సదుపాయాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్ ఆవరణలో మూత్ర విసర్జనకు ఏర్పాటు చేసినప్పటికీ నీటి సౌకర్యం లేకపోవడంతో ఆ ప్రాంతంలో మూత్ర విసర్జన చేయడం సరిగా అవి పాల్గొనలేకపోవడంతో దుర్వాసన భరితంగా మారి రోగాలకు నిలయంగా మారింది. ప్రయాణికుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఫ్యాన్లు కూడా తిరగకపోవడంతో చెమటలు కక్కుకుంటూ ఇబ్బందులు పడుతూ బస్టాండ్‌లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రయాణికులకు వినోదం కోసం ఏర్పాటు చేసిన టివిలు కూడా మూలన పడ్డాయి. నూతన బస్టాండ్ సముదాయం నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించినప్పటికీ అభివద్ధి పనులు సాగుతూనే ఉన్నాయి. ఆర్‌ఎం, డిఎం కార్యాలయాల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అధికారులు ఎటు తేల్చకుండా మీనా మేషాలు లెక్కేస్తూ కాలయాపన చేయడంతో 45 రోజులుగా నిర్మాణం పనులు ఎక్కడికి అక్కడ ఆగిపోయాయి. ఎప్పుడు భవన నిర్మాణం జరుగుతుందో ప్రయాణికులు ఇక్కట్లు ఎప్పుడు తీర్తాయో అని స్థానికులు ఎదురుచూస్తున్నారు. రాయచోటి ప్రాంతం అన్నమయ్య జిల్లాగా ఏర్పడి సంవత్సరం అవుతున్నప్పటికీ నేటికీ అభివద్ధికి ఇంకా అనుకున్నంత స్థాయిలో జరగకపోవడంతో పలువురు జిల్లా అయిన అభివద్ధి మాత్రం సాగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు సత్వరమే స్పందించి ప్రయాణికుల ఇక్కట్లు తీర్చే విధంగా నూతన బస్టాండ్ నిర్మాణం దరిద్రం చేపట్టాలని ప్రజలకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటుచేసి అభివద్ధికి శ్రీకారం చుడతారని ప్రయాణికులు కోరుతున్నారు.
తాగు నీటిని ఏర్పాటు చేయాలి
ఆర్‌టిసి బస్టాండ్ ఆవరణంలో ప్రయాణికులకు తాగునీటిని వెంటనే ఏర్పాటు చేయాలి. ఫ్యాన్లు, టివిలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి.
- రాజశేఖర్, ప్రయాణికుడు, కమలామర్రి, గాలివీడు.
మే చివరి నాటికి పూర్తి చేస్తాం
మే చివరినాటికి ఆర్‌టిసి బస్టాండ్ నిర్మాణ పనులను పూర్తి చేస్తాం. నిర్మాణ పనులు చేపట్టడంతో తాగునీటి వసతి ఏర్పాటుకు ఆటంకం ఏర్పడింది. ఫ్యాన్లు, టివిలకు మరమ్మతులు చేపడతాం.
- రాము, ఆర్‌టిసి ఆర్‌ఎం, రాయచోటి.
- అసంపూర్తిగా బస్టాండ్ నిర్మాణ పనులు










