Jul 04,2023 22:36

ఆందోళన చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి-కనగానపల్లి : వాతావరణ పరిస్థితుల కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం వాతావరణబీమా విడుదల చేయాలని ఎపి. రైతు సంఘం జిల్లా కార్యదర్శి జె.వి.రమణ డిమాండ్‌ చేశారు. ఎపి రైతుసంఘం ఆధ్వర్యంలో మంగళవారం మండల వ్యవసాయ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి నిరసన తెలిపారు. ఈకార్యక్రమములో జెవిరమణతో పాటు ఎపి రైతు సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు బెల్లం మహదేవ్‌ మాట్లాడుతూ మండలంలో వేరుశనగ ,మిరప, టమోటా, అరటి ,మొక్కజొన్న, మామిడి ,తదితర పంటలు అకాల వర్షాలు, ఈదురు గాలుల వల్ల రైతులు పంటలను నష్టపోయారన్నారు. అయితే అధికారులు నష్ట పోయిన రైతులపేర్లు జాబితా లో చేర్చక పోవడంతోవాతావరణ బీమా అందలేదన్నారు. నష్టపోయిన రైతులకు రెండో విడతలో న్యాయం జరిగేటట్లు చూడాలని డిమాండ్‌ చేశారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు పదివేల రూపాయలు పింఛను ఇవ్వాలన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. చడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాయకులు బాలరాజు, ముత్యాలప్ప, వడ్ల గోవిందు, నాగరాజు, బి ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు