ప్రజాశక్తి-మంగళగిరి : సిఎం జగన్ కు 'బెయిల్ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు' అంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటన విడుదల చేశారు. 42 వేల కోట్లు ప్రజాధనం దోచేసి, సీబీఐ-ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1 అయినా పదేళ్లుగా బెయిలుపై ఉన్న ఆర్థిక ఉగ్రవాది జగన్ అంటూ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ, రాజ్యాంగాన్ని కాలరాస్తూ, నీతిమంతుల్ని జైలుకు పంపుతున్నారని ప్రస్తావించారు. జైలులో ఉండాల్సిన జగన్ పదేళ్లుగా బెయిలుపై ఉంటే, జనంలో ఉండాల్సిన చంద్రబాబు జైలులో ఉన్నారని నారా లోకేష్ ఆగ్రహించారు.










