Apr 06,2023 18:54

నోటీసు ఇస్తున్న దృశ్యం

ప్రజాశక్తి -ఉలవపాడు : మండలంలోని కరేడు ర్యాంపులోని పిటీపీ ఫ్యాక్టరి కార్మికులకు ఈ నెల 1వ తేదీ నుంచి జిఒ నెంబర్‌ 123 ప్రకారం కనీస వేతనం రూ.400లు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పిటిపి స్టాఫ్‌, వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియూ)ఆధ్వర్యంలో గురువారం యాజమాన్యానికి చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్‌ నోటీసు అందజేశారు. యూనియన్‌ అధ్యక్షులు జివిబి కుమార్‌, ఆఫీస్‌ బేరర్లు చిమటా శ్రీనివాసులు, సవరం శ్రీనివాసులు, గంజి శ్రీనివాసులు, ఉమ్మడిప్రోలు వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.