Jun 17,2023 21:07

డిఆర్‌ఎంతో మాట్లాడుతున్న అఖిలపక్ష నేతలు

నందలూరు : నందలూరు రైల్వే కేంద్రం అభివద్ధికి సహకరించాలని గుంతకల్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ వెంకటరమణారెడ్డిని శుక్రవారం రాత్రి అఖిలపక్ష నేతలు కోరారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు డిఆర్‌ఎంతో మాట్లాడుతూ కరోనా ముందు ఆగుతున్న జయంతి జనతా ఎక్స్‌ప్రెస్‌, దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ స్టాపేజ్‌ కోసం ఉన్నత ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. విశాఖపట్నం నుండి కడప మధ్య తిరుగుతున్న తిరుమల ఎక్స్‌ప్రెస్‌ వాటరింగ్‌ కోసం కొండాపురం రైల్వేస్టేషన్‌కు తరలిస్తున్నారని, దీనివల్ల రైల్వేకి ఆర్థికంగా ఆదాయం కోల్పోతోందని పేర్కొన్నారు. ఏడు లైన్లు ఉన్న నందలూరులో వాటరింగ్‌ పాయింట్‌ ఏర్పాటు చేస్తే, ఇక్కడి రైల్వే కేంద్రం అభివద్ధి చెందడంతో పాటు, రైల్వేకి ఆదాయం సమకూరుతుందన్నారు. రైల్వే ప్లాట్‌ఫాం, అరవపల్లె క్రీడా మైదానం ప్రహరీకి మధ్య ఉన్న ఖాళీ స్థలం లోని చెట్లు, డ్రెయినేజీని తొలగించి గ్రౌండ్‌కు సమానంగా లెవెల్‌ చేసి క్రీడాకారులకు సహకరించాలని కోరారు. సమస్యలు సానుకూలంగా విన్న డిఆర్‌ఎం చెన్నై నుండి ముంబై, ముంబై నుండి కన్యాకుమారి, కాచిగూడ నుండి తిరుపతి వెళ్లే రైళ్ల నిలుపుదల, రైళ్లలో నీరు పట్టే విషయం, ఇతర సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అఖిలపక్షనేతలు మేడా విజయ శేఖర్‌రెడ్డి, పోతురాజు మస్తానయ్య, నాగిరెడ్డిపల్లి సర్పంచ్‌ జంబు సూర్యనారాయణ, నందలూరు సర్పంచ్‌ మోడపోతుల రాము, మహేష్‌, అరిగెల మణి, మండెం నాగరాజు, కొర్లకుంట సుధాకర్‌, మెహర్‌ ఖాన్‌, నందలూరు ఉపసర్పంచ్‌ ఇబ్బు, హ్యూమన్‌ రైట్స్‌ జుల్ఫికర్‌, చుక్క వెంకటేశ్వర్లు, కాకి చంద్ర, గుగళ్ళ సుబ్బరాయుడు, కానుకుర్తి వెంకటయ్య, కుద్రామణి యాదవ్‌, పుత్త శంకర్‌, అరిగె హరి, ఎల్లంరాజుపల్లి శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.