ప్రజాశక్తి - ఎన్టీఆర్ జిల్లా : నందిగామ నగర పంచాయతీ కార్యాలయం పై గురువారం ఎసిబి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. టౌన్ ప్లానింగ్‌పై వచ్చిన ఫిర్యాదుల మేరకు, అక్రమ అపార్ట్మెంట్‌లపై వచ్చిన ఫిర్యాదులపై సోదాలు నిర్వహిస్తున్నట్లు ఎసిబి అదికారులు వెల్లడించారు. ఈ సోదాలు ఎసిబి అడిషనల్ ఎస్పీ మహారాజు ఆధ్వర్యంలో ఇద్దరు డిఎస్‌పిలు, ఇద్దరు సిఐల సమక్షంలో సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.










