Jun 02,2022 12:04

ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్‌జిల్లా) : నందిగామ నగర పంచాయతీ పరిధిలోని 18వ వార్డు డివిఆర్‌ కాలనీలో సిపిఎం నాయకులు గురువారం ఇంటింటికి సర్వే నిర్వహించారు. ప్రజలు పలు సమస్యలు సిపిఎం నాయకులు దష్టికి తీసుకువచ్చారు. కాలనీలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని డ్రైయినేజిలు సమస్యలు వున్నాయని, సిసిరోడ్లు లేవని, అంతర్గత రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలులో వివక్ష, అర్హులైన వారికి ఇవ్వకుండా అనర్హులకు పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో సిపిఎం నందిగామ పట్టణ కార్యదర్శి కటారపు గోపాల్‌, సిపిఎం నాయకులు సయ్యద్‌ ఖాసిం, డివిఆర్‌ కాలనీ సిపిఎం నాయకులు ఉప్పుతోళ్ళ స్వామి,ఉప్పుతోళ్ళ కుమారి, బత్తుల వెంకటేశ్వరరావు, పుల్లయ్య, రోషియ్య, మల్లేశ్వరీ, సిపిఎం నాయకులు మండూరి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.