ప్రజాశక్తి -పొదలకూరు : అనుమతుల్లేని నాటు తుపాకితో మూగ జీవాలను వధిస్తున్న ముఠా సభ్యులను బుధవారం పొదలకూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు నెల్లూరు గ్రామీణ డిఎస్‌ఫి వీరాంజనేయ రెడ్డి పొదలకూరు సర్కిల్ పోలీస్ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మండలంలోని చాటగొట్ల గ్రామానికి చెందిన కడివేటి భాస్కర్, నల్లబాలెం సురేంద్ర, నల్లబాలెం కిషోర్, నల్లబాలెం వెంకట రమణయ్య, నాగరాజు, వేణు ముఠాగా ఏర్పాడ్డారు.నాటు తుపాకీతో ఆవులను చంపి మాంసాన్ని విక్రస్తుం డేవారు. ఈ నేపథ్యంలో మంగళవారం మరుపూరు గ్రామానికి చెందిన పెంచల మ్మ ఆవు చోరీకు గురైంది. దీంతో ఆమె స్థానిక పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసినట్లు డిఎస్‌పి తెలిపారు. వీరిలో నాగరాజు, వేణు పరారీలో ఉండగా, మిగిలిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. విలేకర్ల సమావేశంలో సిఐ సంగమేశ్వర రావు, ఎస్‌ఐ కరిముల్లా సిబ్బంది సుబ్బారావు, రసూల్, శ్రీను, రమేష్ ఉన్నారు.










