నలందలో 'ప్రీ క్రిస్మస్' సంబరాలు
ప్రజాశక్తి - కావలి : స్థానిక కో-ఆపరేటివ్ కాలనీలో నలంద కాన్సెప్ట్ స్కూల్‌లో శనివారం ఘనంగా ప్రీ క్రిస్మస్ సంబరాలు నిర్వహించారు. ఎస్‌టిబిసి చర్చి ఇంగ్లీష్ చాప్లిన్ రెవ.ఇ.జైపాల్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్రిస్మస్ ట్రీని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన ఆటలు, పాటలు ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా విద్యార్థులు యేసుక్రీస్తు, మేరీమాత, ఏంజిల్స్, గొర్రెల కాపర్లు వంటి వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. నలంద విద్యాసంస్థల డైరక్టర్ ఎమ్‌డి.వశీం మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు పాఠశాలలో నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో పండుగలపై, సంస్కృతి, సాంప్రదాయాలపై అవగాహన పెరిగి, జాతి సమైక్యతకు దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో నలంద విద్యాసంస్థల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.










