ములకలచెరువు : నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే ద్వారకనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని గూడుపల్లి, కాలువపల్లె గ్రామ పంచాయతీల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ముందుగా ఒటిఎస్‌్ స్కీం ద్వారా రూ.10వేలు చెల్లించిన లబ్దిదారులకు ములకలచెరువు సచివాలయంలో ఒటిఎస్ పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వంద శాతం అమలు చేస్తోందన్నారు. అనంతరం గూడుపల్లె, కాలువపల్లె గ్రామాల్లో చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో చర్చించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరానికి చర్యలు చేపట్టారు. గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాసులు, ఎంపిడిఒ అశ్వని, ఎంపిపి సాయిలీలా, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, సర్పంచులు రెడ్డెప్ప, రహ్మతి, జయచంద్రకుమార్, రాంబాబు, మాజీ సర్పంచి రవీంద్రారెడ్డి, నాయకులు రవిశేఖర్రెడ్డి, కేశవరెడ్డి, మల్లికార్జునరెడ్డి, సుదర్శన్రెడ్డి, మదుసూదన్రెడ్డి, విశ్వనాధ్, చాంద్ బాషా పాల్గొన్నారు.










