నివేదిక యువతకు ఆదర్శంగా ఉండాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : జరిగిన కార్యదర్శి నివేదిక వచ్చే యువతరానికి ఆదర్శంగా ఉండాలని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి వి శేషులు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఎఆర్‌ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయగిరి, సీతారామపురం మండలాల యుటిఎఫ్ కౌన్సిలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని మండలశాఖ అధ్యక్షులు ఎస్‌ఎం జి వరప్రసాద్ రాజు అధ్యక్షన ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాల్సందేనని, ప్రత్యామ్నయంగా ప్రవేశ పెడతామంటున్న జిపిఎస్‌ను ఒప్పుకునే పరిస్థితి లేదని మండిపడ్డారు. నవరత్నాల్లో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలో భాగంగా ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నామని కొత్తగా కోరే కోరిక ఏం కాదని గుర్తు చేశారు. ఇచ్చిన హామీని అమలు కోసం పాత పెన్షన్ ను పునరుద్దావించాలని యుటిఎఫ్ చేపట్టే సంకల్ప దీక్షను భగం చేశారని దుయ్యబట్టారు. అలాగే జిల్లా కార్యదర్శి ఇ.తిరుపతయ్య రాష్ట్ర కౌన్సిలర్ కె.చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 1వ తేదీ జీతాలను చెల్లించాలని ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పిఎఫ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఉదయగిరి, సీతారామపురం మండలాల నూతన మండల అధ్యక్షులు కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఉదయగిరి మండల శాఖ అధ్యక్షులుగా షేక్ ఎం డి కరీముల్లా, (మున్నా) ప్రధాన కార్యదర్శి ఎన్.రామకృష్ణ గౌరవాధ్యక్షులుగా జి.ఎలీషా, సీతారామపురం అధ్యక్షులు బి.శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, గౌరవాధ్యక్షులు షేక్ జి.రంతు జాని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రెండు మండలాల 110 మంది ఉపాధ్యాయులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.










