May 02,2023 21:14

నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న దృశ్యం

నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న దృశ్యం
నిత్యావసరాలు పంపిణీ
కొడవలూరు :మండలంలోని క్షయ బాధితులకు జిల్లా కలెక్టర్‌, డిఎంహెచ్‌.. ఆదేశాల మేరకు కొడవలూరు పీహెచ్సీ సిబ్బంది సొంత నిధులతో మంగళవారం నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి ఎం.రామకష్ణ. మాట్లాడుతూ క్షయ బాధితులు పోషక విలువలున్న ఆహారం తీసుకోవాల్సిన... అవసరం ఎంతైనా ఉందన్నారు. అందువల్లే పోషక విలువలున్న నిత్యావసరాలను పంపిణీ చేశామన్నారు. క్షయ వ్యాధి ప్రబలంగానే కంగి పోవాల్సిన అవసరం లేదని, వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పకుండా తీసుకోవడంతోపాటు పోషక విలువలున్న ఆహారం తీసుకుంటే సులువుగా నయమవుతుందని సూచించారు
. కార్యక్రమంలో వైద్యాధికారి 2 బాలచంద్రబాబు, సీహెచ్‌ఓ సోమశేఖర్‌, హెచ్‌ఎస్‌ రామ్మోహన్‌, హెచ్‌ఎ షఫీ ఉద్దీన్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.