Dec 19,2022 22:15

రైతుల సమస్య వింటున్న తహశీల్దార్‌

ప్రజాశక్తి మడకశిర : కొడి కొండ చెక్‌ పోస్ట్‌ నుండి శిరా వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి వల్ల నష్టపోతున్న రైతుల భూములకు ధరలను పెంచి నష్టపరిహారం ఇవ్వాలని పలువురు రైతులు కోరారు. ఈ మేరకు వారు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్‌ ఆనంద్‌కుమార్‌కు సమర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మడకశిర, హరేసముద్రం , బుల్లసముద్రం రెవెన్యూ గ్రామాలకు చెందిన 26 మంది రైతులకు చెందిన వ్యవసాయ సాగు భూములను రహదారి ఏర్పాటు కోసం భూసేకరణ కింద కోల్పోతున్నామన్నారు. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం పరిహారాన్ని ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు బద్రీష్‌, సుబ్బారెడ్డి, నరసప్ప, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.