Jul 02,2023 21:48

సమావేశంలో పాల్గొన్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌మ : వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటిన నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంలో కానీ, గహాలు నిర్మించడంలో పూర్తిగా విఫలమైందని టిడిపి నాయకులు విమర్శించారు. ఆదివారం ఆ పార్టీ కార్యాలయంలో నాయకులు మాట్లాడుతూకోట్లాది రూపాయలు ఖర్చు చేసి 80 శాతం టిట్కో ఇల్లు టిడిపి ప్రభుత్వం నిర్మిస్తే మిగతా 20 శాతం పనులు కూడా చేపట్టని చేతగాని ప్రభుత్వం వైసిపి ప్రభుత్వమని విమర్శించారు. ఈ ప్రభుత్వం అభివద్ధిని గాలికి వదిలేసిందని, ఎక్కడ చూసినా ల్యాండ్‌ మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్‌ మాఫియాలే రాజ్యమేలుతున్నాయన్నారు. రాష్ట్రంలో 25 లక్షల ఇళ్ళు నిర్మిస్తున్నామని గొప్పలు చెప్పుకోవడమే తప్ప నిర్మించింది ఏమీ లేదన్నారు. ఇప్పటికైనా నిరుపేదలకు ఇళ్లు నిర్మించి పేదల సొంతింటి కల నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ కన్వీనర్‌ రామాంజనేయులు, రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి మహమ్మద్‌ రఫీ, జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, ఎస్సీ సెల్‌ నాయకుడు మాల మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.