Dec 09,2022 22:22

జాబ్‌ మేళాలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపి, యుతకు ఉపాధి, ఉద్యోగ కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఎపి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్‌, సీదాప్‌ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ జాబ్‌ మేళాకు 16 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలను నిర్వహించారు. మొత్తం 668మంది నిరుద్యోగులు హాజరుకాగా వారిలో ప్రతిభ కనబరచిన 245 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువత చదువుతో పాటు నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా మెరుగైన ఉపాధిని ఉద్యోగ అవకాశాలను పెంపొందించుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ నరసయ్య, తహశీల్దార్‌ యుగేశ్వరి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ యర్రగుంట భాగ్యలక్ష్మి, ఎంప్లారు మెంట్‌ ఆఫీసర్‌ కళ్యాణి, నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఖయ్యూం. సీడాప్‌ జెడిఎం సూర్యనారాయణ, ఎపిఎం లక్ష్మీనారాయణ, కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ ఉదరు కుమార్‌, వైసిపి విద్యార్థి విభాగ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమర్‌ నాథరెడ్డి, పవన్‌ కుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.