నిర్మాణాలు వేగవంతం చేయాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : జగనన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఎంపిడిఒ ఐజాక్ ప్రవీణ్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని శకునాలపల్లి సచివాలయం పరిధిలో జగనన్న ఇళ్లు నిర్మాణం చేపడుతున్న లేవుట్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంత మంది లబ్ధిదారులకు త్వరగా తమ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని ఇంకా మొదలు చేయని వారు త్వరగా నిర్మాణాలు చేపట్టాలని పలు సూచనలు చేశారు. నిర్మాణాలు చేపట్టే వరకు విడతల వారీగా నగదు అందుతున్నాయని తెలిపారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు త్వరగా జియో టాకింగ్ చేసి నిర్మాణాలను చేపట్టి టార్గెట్ పూర్తి చేయాలన్నారు. అనంతరం శకునాలపల్లి సచివాలయంను పరిశీలించి సిబ్బంది 100శాతం బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అన్నారు. మధ్యాహ్నం 3 నుండి 5 స్పందన కార్యక్రమం జరగాలని ఎవరు కూడా ప్రబ్వుత పనులకు సంభందించి పెండింగ్ పెట్టుకోవద్దని సర్వేలు వస్తే 100శాతం త్వరగా చేయించాలన్నారు. ముఖ్యంగా వాలంటీర్లు బయోమెట్రిక్ హాజరు వేయాలని ప్రజలపై మంచిగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మండల కో-ఆర్డినేటర్ గాజుల ఇమ్రాన్, పంచాయతీ కార్యదర్శి కరీముల్లా, ఖాదర్ కరిమూల్లా, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.










