Feb 08,2023 22:12

ఫొటో : మాట్లాడుతున్న ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్‌

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
ప్రజాశక్తి-ఉదయగిరి : ఉపాధి కూలీల జాబ్‌ కార్డుకు ఆధార్‌ లింక్‌ చేయడంలో గ్రామ వాలంటీర్లు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్‌ పేర్కొన్నారు. బుధవారం బిట్‌-1 సచివాలయం ఆవరణంలోని రైతు భరోసా కేంద్రంలో వాలంటీర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ బయోమెట్రిక్‌ హాజరు 100 శాతం వేయాలన్నారు. ఉపాధి హామీకి సంభందించిన ఉపాధి కూలీలు డబ్బులు త్వరగా అందాలంటే వారి ఆధార్‌కార్డు నెంబర్‌ జాబ్‌కార్డుకు అనుసంధానం కావాలన్నారు.
అప్పుడే కూలీలు చేసిన నగదు వారికి చెందుతాయని ప్రతి వాలంటీర్‌ తమ పరిధిలోని జాబ్‌ కార్డులకు ఆధార్‌ సీడింగ్‌ వేగవంతం చేయాలన్నారు. సర్వేలలో వెనుక పడకూడా చెప్పిన పనిని నిర్లక్ష్యం చేయకుండా కూలీలకు నగదు అందేలా ప్రతి వాలంటీర్‌ సహకరించాలన్నారు. అయినా నిర్లక్ష్యం వహిస్తే అట్టి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధిహామీ ఇన్‌ఛార్జి ఎపిఒ శ్రీనివాసులు, సచివాలయ సిబ్బంది నారాయణ, మండల కో ఆర్డినేటర్‌ ఇమ్రాన్‌ పాల్గొన్నారు.