Apr 17,2023 21:13

నిర్దేశించిన గడువులోగా రీసర్వే పూర్తి : కలెక్టర్‌


రాయచోటి: భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రీసర్వే పక్కాగా పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో రీ సర్వే, సాధారణ ఎన్నికలు, వసతి గ హాల పర్యవేక్షణ, తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీసర్వే పూర్త యిన గ్రామాల్లో నిర్ణీత కాల పరిమితిలోగా హద్దురాళ్ల ప్లాంటేషన్‌ ప్రక్రియ పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. స్టోన్‌ ప్లాంటేషన్‌పై నిర్లక్ష్యం చూప రాదని, ఫేజ్‌-2 కింద చేపట్టిన రీ సర్వే, స్టోన్‌ ప్లాంటేషన్‌ పనులు మరింత వేగవం తం చేయాలన్నారు. సిసిఎల్‌ఎఆదేశాల మేరకు రీ సర్వే చేసే సమయంలో భూమి పైన రోడ్డు, వంక, వాగు ఇలా ఏముంటే అదే రికార్డులలో పక్కాగా నమోదు చేయా లన్నారు. వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఈవేసవికాలంలో నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు సూచిం చారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను దష్టిలో ఉంచుకొని తప్పులు లేని ఓటర్ల జాబితా తయారు చేసేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల నియమ నిబంధనల మేరకు ప్రొసీజర్‌ ప్రకారం డిలీషన్‌, ఆడిషన్స్‌ చేయాలన్నారు. ఆడిషన్స్‌కు సంబంధించి ఇఆర్‌ఒ తప్పక ఎంక్వయిరీ చేయాలన్నారు. తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు ప్రతి బిఎల్‌ఒ ఆరు రిజిస్టర్లు మెయింటినెన్స్‌ చేయాలన్నారు. ప్రతి తహశీల్దార్‌ బిఎల్‌ఒ రిజిస్టర్లు చూస్తున్నారా? లేదా? పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ సత్యనారాయణ, ల్యాండ్‌ అండ్‌ సర్వే ఎడి జయరాజ్‌, కలెక్టరేట్‌ ఎఒ బాలకృష్ణ, గ్రామ వార్డు సచివాలయాల ఎఒ మనోహర్‌ రాజు పాల్గొన్నారు.
- సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష