కేంద్ర బడ్జెట్ నిరాశను మిగిల్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 బడ్జెట్‌ను బుధవారం సుమారు రూ.48 లక్షల కోట్లతో ప్రవేశ పెట్టారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలైన ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, గనుల కేటాయింపుల ఊసే కనిపించలేదు. రైల్వే బడ్జెట్‌లోనూ కడప-బెంగళూరు రైల్వేలైన్ సహా పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చట్టబద్దమైన హామీలను విస్మరించి కార్పొరేట్ల భజన చేసింది. ఎంఎస్‌ఎంఇలకు ప్రోత్సాహకాలు, అద్దె వ్యవసాయపనిముట్ల, ప్రకృతి వ్యవసాయాన్ని ఉటంకించింది. వేతనజీవుల ఆదాయపన్ను రూ.ఐదు లక్షల నుంచి రూ. ఏడు లక్షలకు మినహాయించడం మినహా కొత్తదనం కొరవడింది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి సంబంధించి వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్ సిఫార్సులను విస్మరించి గతేడాది వ్యవసాయానికి కేటాయించిన రూ.1.32 కోట్ల నుంచి రూ.1.25 లక్షల అత్తెసరు కేటాయింపులతో సరిపెట్టింది. పజాశక్తి- కడప ప్రతినిధి/యంత్రాంగం
కేంద్ర బడ్జెట్‌లో పెండింగ్ ప్రాజెక్టుల ప్రస్తావనే కొరవ డింది. జిల్లాకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టుల కేటాయింపుల వివ రాలు జాడే కనిపించలేదు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలైన ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, గనుల కేటాయింపు, వెనుకబడిన ప్రాంతాల అభి వృద్ధి పెండింగ్ నిధులు, కడప-బెంగళూరు, కడప-విజయవాడ వంటి రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులు చేయాల్సి ఉంది. రూ.2.41 లక్షల కోట్లతో రైల్వేబడ్జెట్ ప్రస్తావన చేసింది. ప్రాజెక్టుల వారీగా కేటా యింపులు తెలియడం లేదు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ప్రధానమంత్రి తన హామీనే విస్మరించి, వ్యవసాయ అనుబంధ రంగాలైన గ్రామీణాభివృద్ధికి నిధులు భారీగా కుదించింది. వ్యవసాయాభివృద్ధికి అరకొరగానే నిధులు కేటాయించింది. ఉమ్మడి జిల్లాలోని సుమారు ఐదు లక్షల మంది రైతుల్లో ఎందరికి ప్రయోజనం చేకూరనుందో తెలియని అనిశ్చితి నెలకొంది. ఉద్యోగుల ఆదాయ పన్ను శ్లాబులను సవరించడం ఊరటను కలిగించింది. ఫలితంగా ఉమ్మడి జిల్లాలోని 32 వేల మంది ఉద్యోగులు, 22,800 మంది పెన్షనర్లకు రిక్తహస్తాన్ని చూపించింది. రాష్ట్ర విభజన జరిగిన తొమ్మిదేళ్లు గడిచిన నేపథ్యంలో వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల విడుదల జాడే కనిపించలేదు. జిల్లాలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులైన కడప- బెం గళూరు, కడప-విజయవాడ, ఓబులవారిపల్లి - కృష్ణపట్నం సివిల్ రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులపై అందరిదృష్టీ నిలిచింది. ఉపాధి హామీ పనుల కేటాయింపులు సమాచారం తెలియాల్సి ఉంది. దేశ వ్యాప్త ంగా 81 లక్షల స్వయంసహాయక సంఘాలను ఏర్పాటు చేస్తామని హా మీనిచ్చింది.
జిల్లాకు రికస్తహస్తమే కేంద్ర బడ్జెట్‌లో జిల్లాకు రిక్తహస్తమే. రాష్ట్ర విభజన చట్టంలోని వెను కబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ, విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు వంటి ప్రధాన హామీలకు ఏళ్ల తరబడి అన్యామే చేస్తోంది. కడప-బెంగళూరు, కడప-విజయవాడ, కృష్ణపట్నం-ఓబులవారిపల్లి ప్యాసింజన్ రైల్వేలైన్, కడప నుంచి రాజధానికి రైలు ప్రస్తావన లేదు. కడప విమానాశ్రయం రన్‌వే పొడిగింపు పనుల కేటాయింపుల ప్రసా వనే లేదు. వ్యవసాయ రంగ కేటాయింపులను పరిశీలిస్తే రైతుల ఆదా యం రెట్టింపు హామీని తుంగలో తొక్కేసినట్లు అవుతోంది. ప్రధాన మంత్రి హామీకే దిక్కు లేకుండా పోవ డం విస్మయాన్ని కలిగిస్తోంది.
- జి.చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి, కడప. మెండిచేయిన్నికలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ రూపల్పన చేయ డం కనిపించింది. కార్పొరేట్లను ఊడిగం చేయడం దారుణం. రైతాంగానికి కేటాయింపులు తగ్గించడం దారుణం. దేశాన్ని అమ్మకానికి పెట్టినట్లు ఉంది. ఎపికి సంబందించి ఎటువంటి హామీ నెరవేర్చిన పాపానలేదు. ద్రవ్యోల్బణాన్ని పెంచి సామాన్యుల జీవితాలను కడగండ్ల పాలు చేసింది. కడప-బెంగళూరు, విజయవాడ రైల్వేప్రాజెక్టు ఊసేలేదు.
- జి.ఈశ్వరయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి, కడప.
రైతు వ్యతిరేక బడ్జెట్. రూ.48 లక్షల కోట్ల బడ్జెట్ వ్యవసా రైతు వ్యతిరేక బడ్జెట్‌రైతు వ్యతిరేక బడ్జెట్. రూ.48 లక్షల కోట్ల బడ్జెట్ వ్యవసా యానికి గాలికి వొదిలేసింది. దేశంలో 70 శాతం రైతులు ఉండగా, రూ.1.25 లక్షల కోట్లతో సరిపెట్టడం విస్మయాన్ని కలిగించింది. ఈలెక్కన 2.57 శాతం కేటా యింపులు చేయడం దారుణం. 1940 నుంచి 2014 వరకు 13 మంది ప్రధాన మంత్రుల హాయంలో రూ.40 లక్షల కోట్లు అప్పు ఉంటే, మోడీ హయా ంలో నుంచి రూ.1.09 లక్షల కోట్లు అప్పు చేయడం విస్మయకరం. ఈఏడాదికి మరో రూ.15.30 లక్షల కోట్లు అప్పు చేస్తామనడం పేర్కొనడం దారుణం. మొత్తం బడ్జెట్‌ను పరిశీలిస్తే 34 శాతం అప్పులే కనిపించాయి.
- ఎన్.తులసిరెడ్డి, పిసిసి మీడియా చైర్మన్.రాష్ట్రానికి అన్యాయమే కేంద్రబడ్జెట్‌లో రాష్రానికి, జిల్లాకు తీరని అన్యాయం. ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మించి మోసం చేయడం దారుణం. వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయింపులు, పోలవరం ప్రస్తావనే లేదు. కడప స్టీల్‌ప్లాంట్, కడప-బెంగళూరు రైల్వేలైన్ ఊసే లేకపోవడం దారుణం.
- ఆర్.శ్రీనివాసులరెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షులు.
కార్మిక, ప్రజావ్యతిరేక బడ్జెట్‌కంద్ర బడ్జెట్ కార్మికులకు, రైతులకు, శ్రమ జీవులకు, ప్రజల కు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. దీనిని ప్రజలు అందరూ తిరస్క రించాలి. ఐసిడిఎస్, మధ్యాహ్న భోజనం, జాతీయ ఆరోగ్యమిషన్, జాతీయ విద్యామిషన్, జాతీయ జీవనోపాధులు మిషన్‌లకు కేటాయింపులు పెంచలేదు. ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు, పనిదినాలు 200కు పెంచాలి. రోజు వేతనం రూ.600 చేయాలిఅసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులను కేటాయించి సంక్షేమ పథకాలను వర్తింపజేయాలి.
- పి.శ్రీనివాసులు, సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి.
విద్యారంగానికి నిధులు శూన్యం కేంద్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి అధిక నిధులు మంజూరు చేస్తారని అనుకుంటే అంకెలకే పరిమితమైంది. బిజెపి ప్రభుత్వం విద్యా రంగం పట్ల నిర్లక్ష్యం వహిస్తోంది. విద్యా ప్రమాణాలు తగ్గిస్తూ ప్రయివేట్, కార్పొరేట్ విద్యకు ప్రోత్సహిస్తోంది. విదేశీ యూనివర్సిటీలకి రెడ్ కార్పొరేట్ వేసి స్వాగతం పలుకుతోంది. విదేశీ యూనివర్సిటీల అనుమతులు రద్దు చేయాలి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కోసం రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి.
- నరసింహ, ఎస్‌ఎఫ్‌ఐ అన్నమయ్య జిల్లా కార్యదర్శి.
మధ్యతరగతి ఉద్యోగులకు నిరాశేభారతదేశంలో ఆదాయం పన్ను లెక్క కట్టేందుకు రెండు పద్ధతులున్నాయి. ఒక ఉద్యోగికి తాజా బడ్జెట్ ప్రతిపాదనల వల్ల సంవత్సరానికి తగ్గే పన్ను భారం రూ.2,500 మాత్రమే. కొత్త రెజీమ్ ఎంచుకున్న ఉద్యోగులకు కొంత లాభం ఉంది. కొత్త రెజీమ్‌లో పొదుపుకు ప్రోత్సాహకాలు ఉండవు. కేంద్ర ప్రభుత్వం తాను అనుకున్న స్టాక్ మార్కెట్ అనుకూల అజెండాను అమలు చేసింది తప్ప ఉద్యోగుల ఆకాంక్ష మేరకు ఆదాయపు పన్ను భారాన్ని తగ్గించలేదు.
- ఎ.రఘునాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం, కడప.
ఆకలి సూచికలో వెనుకబాటుి ఉద్యోగుల సంఘం, కడప.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. కేవలం ప్రైవేటు పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న బడ్జెట్‌ను తిరస్కరించాలి. ఆకలి సూచికలో వెనుకబడటం, పోషకాహార లోపం తదితరాలతో బాధపడుతున్న ప్రజానీకానికి బడ్జెట్ ఎటువంటి రక్షణ కల్పించలేదు
- ఎ.రామమోహన్, సిపిఎం నగర కార్యదర్శి, కడప.
వేతన జీవులకు ఊరట సిపిఎం నగర కార్యదర్శి, కడప.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లో ఆదాయ పన్నుల విషయంలో వేతన జీవులకు ఊరట కల్పించినప్పటికి వారికి ఆదాయ సంపార్జన మార్గాల వైపు బడ్జెట్ కేటాయించి ఉంటే ఇంకా బాగుండేది. యువత కోసం పీఎం కౌశల్ పథకంలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల కోసం బడ్జెట్ కేటాయించడం మంచి నిర్ణయం.
- డాక్టర్ రమేష్, ఆర్థిక విశ్లేషకులు, కడప.
కొఠారి కమిటీకి ఆమడదూరంకొఠారి కమిషన్ విద్యారంగానికి జిడిపిలో 6 శాతం నిధులు కేటాయించాలని చెప్పినా ప్రస్తుత బడ్జెట్లో జిడిపిలో 0.3 శాతం మొత్తం బడ్జెట్లో 2.5 శాతం మాత్రమే కేటాయించడం దారుణం. విద్యా రంగానికి అరకొర నిధులు కేటాయింపు చేయడం ద్వారా విద్యారంగ బాధ్యతల నుండి ప్రభుత్వం తప్పుకుంటున్నట్లు అర్ధమవుతోంది. శాస్త్ర, సాంకేతిక రంగాలకు బడ్జెట్‌లో 2 శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా 0.7 శాతం మాత్రమే కేటాయించింది. శాస్త్రీయ ఆలోచన కలిగిన విద్యార్థుల్ని తయారు చేయడానికి అవరోధం ఏర్పడుతుంది.
- లక్ష్మిరాజ, విజరుకుమార్, మహేష్‌బాబు, యుటిఎఫ్ నాయకులు.










