Apr 04,2023 21:54

ఫొటో : బాధితులను పరామర్శిస్తున్న నాయకులు

నిందితులను అరెస్టు చేయాలి
ప్రజాశక్తి-నెల్లూరు : పొదలకూరు మండలం చాటగోట్ల గ్రామంలో పల్లాపు అనసూయమ్మపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని మంగళవారం కుల వ్యవక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు డిమాండ్‌ చేశారుదీ మేరకు వారు నెల్లూరు జిజిహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలు అనసూయమ్మను కెవిపిఎస్‌ నాయకులు ఆలూరు తిరుపాలు, కె.పెంచలనరసయ్య, డివిఎంసి మేంబర్‌ శేషం, సుదర్శన్‌, సిపిఎం, సిఐటియు, నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, బత్తల కిష్టయ్య, పరామర్శించి మాట్లాడారు.
అనంతరం వారు మాట్లాడుతూ పొదలకూరు మండలం చాటగొట్ల గ్రామంలో రూ.10వేల బాకీ విషయంలో పల్లాపు అనసూయమ్మపై అదే గ్రామానికి చెందిన అచ్చి ప్రభాకర్‌ వివస్త్రను దాడి చేయడాన్నీ కెవిపిఎస్‌ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అనసూయమ్మపై దాడి చేసిన అచ్చి ప్రభాకర్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.