నిజాయితీకి అండగా పోరాటం చేస్తాం..
ప్రజాశక్తి-బిట్రగుంట : టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజాయితీకి అండగా పోరాటం చేస్తామని పసుపులేటి సుధాకర్ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా చెంచులక్ష్మిపురం గ్రామం నుండి బోగోలు బజారు సెంటర్ అంబేద్కర్ కూడలి వరకు భారీ ర్యాలీని పిఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత పసుపులేటి సుధాకర్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయాలని, రాజశేఖర్ రెడ్డి రాజ్యాంగాన్ని నిర్మూలించాలన్నారు. స్కిల్డ్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్టు అయినా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తాడని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో అభివృద్ధి కంటే అక్రమ అరెస్టులు, భూ కబ్జాలు, గ్రావెల్ తవ్వకాలు ఎక్కువ జరిగాయని రాబోయే ఎన్నికల్లో ప్రజలే వారికి తగిన బుద్ధి చెప్తారన్నారు. కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు పసుపులేటి వెంకటేశ్వర్లు, తమ్మిశెట్టి సుబ్రహ్మణ్యం, జగదీష్, కిషోర్, ప్రసాదు, సురేష్, మామిడి వెంకటేశ్వర్లు, ప్రత్యూష, నరేంద్ర, మస్తాన్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.










