- ఇచ్చింది రూ.13,238 కోట్లు
- ఖర్చు రూ.3,777 కోట్లు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : నీటిపారుదల శాఖలో ఇచ్చిన నిధులు కూడా ఖర్చు కావడం లేదు. దీంతో ఈ ఏడాది, వచ్చే ఏడాదిలో పూర్తి కావాల్సిన అనేక పథకాలు 2024 సంవత్సరానికి పొడిగించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనికి కారణమేమిటో అధికారయంత్రాంగం చెప్పలేకపోతోంది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వర వివిధ నీటి పథకాల నిర్మాణం కోసం 13,237.78 కోట్ల రూపాయలు ఇవ్వగా, ఆ మొత్తంలో కేవలం 3777.52 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యాయి. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు నివేదిక రూపొందించారు. ఇందులోనే పోలవరం ప్రాజెక్టు కోసం చేసిన ఖర్చు కూడా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇరత తక్కువగా నిధులు ఖర్చు కావడానికి భిన్న కారణాలు వ్యక్తమవుతున్నాయి. కేటాయించిన నిధులను విడుదల చేయడంలో ఆర్ధికశాఖ అనుసరిస్తున్న విధానం ఒక కారణమని అంటున్నారు. దీంతో పాటు కాంట్రాక్టర్లతో ఉన్న సమస్యలు, ఇతర అంశాల కారణంగా ప్రభుత్వం నుండి వచ్చిన నిధులను కూడా ఖర్చు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ స్థాయి నీతీఅయోగ్ నివేదికలో నీటి నిర్వహణ సూచికలో రాష్ట్రానికి ద్వితీయ స్థానం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. భూగర్భ జలాల విభాగంలో అయితే మొదటి స్థానం వచ్చిరది. కేటాయిరచిన నిధులు సజావుగా ఖర్చు చేయలేకపోతున్న పరిస్థితుల్లో ఈ అవార్డులు రావడం ఆశ్చర్యంగానే ఉందని ఒక అధికారి వ్యాఖ్యానించడం విశేషం.
కొత్తగా 2లక్షల ఉచిత బోరుబావులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేసిన నిధుల ఖర్చు సంగతి ఎలా ఉన్నప్పటికీ రానున్న సంవత్సరానికిగానూ రైతుల కోసం 2 లక్షల ఉచిత బోరు బావులు తవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధమైనాయి. రైతు భరోసా, వైఎస్‌ఆర్ జలకళ కార్యక్రమాల కింద ఈ పనులు చేపట్టనున్నారు. దీనికి నిధులు ఎలా సమకూరుస్తారు, ఎలా వ్యయం చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. రానున్న ఆర్థిక సంవత్సరానికి నీటిపారుదల శాఖ అధికారులు 15వేల కోట్ల రూపాయలకు పైగానే నిధులు కోరుతున్నట్లు సమాచారం. ఇచ్చిన నిధులు ఖర్చు చేయని పరిస్థితిలో ఆర్ధికశాఖ ఎంత వరకు నిధులు ఖరారు చేస్తుందన్నది చూడాలి.










