May 24,2023 22:04

ఫొటో : డిఎఒకు వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు

నీటి సరఫరా చేయాలని సిపిఎం వినతి
ప్రజాశక్తి-కావలి : కావలి పట్టణం బుడంగుంట ఇందిరమ్మ గ్రీన్‌సిటీ హౌసింగ్‌ కాలనీకి వెంటనే మున్సిపల్‌ కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేయాలని బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో ఆర్‌డిఒ కార్యాలయంలో డిఎఒ పసుపులేటి సుబ్రహ్మణ్యంకు వినతిపత్రం అందజేశారు. అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ బుడమగుంట ఇందిరమ్మ గ్రీన్‌ సిటీకాలనీకి కొన్ని సంవత్సరాల నుండి మున్సిపల్‌ నీటిసరఫరా జరగడం లేదన్నారు. దీనివల్ల అక్కడ నివసించే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
సమ్మర్‌ స్టోరేజీ నీళ్లు కాలనీ పక్కన టౌన్‌కి వస్తున్నప్పటికీ గతంలో ఈ కాలనీకి కూడా ఈ నీళ్లే సరఫరా జరుగుతుండేవన్నారు. మధ్యలో నీటి సరఫరా ఆగిపో యిందన్నారు. నీళ్లుఉన్నప్పటికీ ట్యాంకర్ల ద్వారా లక్షల రూపాయలు ఖర్చు చూపిస్తూ, నీటిని సరఫరా చేయడం ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కొన్ని సంవత్సరాలుగా ఈ కాలనీకి నీటి సరఫరా జరగనందున ఇక్కడి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అయినా అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలుపుతున్నపటికీ పట్టించుకోకపోవడం చాలా విచారకరమన్నారు. ప్రభుత్వం పుష్కలంగా ప్రజలకు తాగునీరు అందించలేని దయలేని స్థితిలో ఉందన్నారు. ఇప్పటికైనా అధికారులు సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌ నీళ్లను మున్సిపల్‌ కొళాయిల ద్వారా నీటిని సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పట్టణ కమిటీ సభ్యులు వై.కృష్ణమోహన్‌, సిపిఎం నాయకులు వి.బాబురావు, పి.సుబ్రహ్మణ్యం, తలపల రత్నం, కార్యకర్తలు పాల్గొన్నారు.