Feb 13,2023 18:48

నీటి పరీక్ష విధానాన్ని వివరిస్తున్న పెంచల్‌రెడ్డి

ప్రజాశక్తి-లక్కిరెడ్డిపల్లి : గ్రామాలలో నీటి సంరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన ఉండాలని ఆర్‌డబ్ల్యుఎస్‌ డిఇ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. జల సంజీవని మిషన్‌ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఎంపిడిఒ సభా భవనంలో జల సంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 నాటికి ప్రతి ఒక్కరికీ మంచి నీటి కుళాయిల ద్వారా 55 లీటర్ల నీటిని అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యంగా పెట్టుకున్నాయని పేర్కొన్నారు. జల సంజీవన్‌ కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు. గ్రామ స్థాయి పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేసి కమిటీలు ద్వారా నీటిని అందిస్తామన్నారు. నీటిని టెస్ట్‌ ద్వారా పరీక్షలు నిర్వహించి ఆ గ్రామంలోని మంచినీటి శాతాన్ని గుర్తించి అవసరమైనంతవరకు మంచినీరు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎఇ కిషోర్‌ కుమార్‌, నీటి పరిరక్షణ అధికారి పెంచల్‌రెడ్డి, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.