ప్రజాశక్తి-మడకశిర మండలంలోని నీలకంఠాపురంలో వెలసిన నీలకంఠేశ్వర స్వామిని కలెక్టర్ బసంత్‌కు మార్ దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఛైర్మన్, మాజీమంత్రి రఘువీరారెడ్డి దంపతులు కలెక్టర్ దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రఘువీరా దంపతులు ముందుండి ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావడం సంతోషకరమన్నారు. సత్యసాయి జిల్లా కలెక్టర్‌గా తాను భాధ్యతలు చేపట్టినప్పటి నుండి శ్రీ నీలకంఠేశ్వరుడిని దర్శించుకోవాలని అనుకున్నప్పటికీ కుదరలేదన్నారు. భోగి పండుగ సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి నీలకంఠాపురం వచ్చినట్లు తెలిపారు. అలాగే జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట తహశీల్దార్ ఆనంద్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
అమరాపురం : మండల పరిధిలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హేమావతి సిద్ధేశ్వరస్వామి ఆలయాన్ని కలెక్టర్ బసంత్‌కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఇందులో భాగంగా ఆలయ అర్చకులు, కమిటీ ఛైర్మన్ మంజునాథ్ పూర్ణకుంభాలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ మంజున్నాథ్ కలెక్టర్‌కు పూలమాలలు వేసి సత్కరించారు ఈకార్యక్రమంలో సర్పంచి తిప్పేస్వామి, పంచాయతీ కార్యదర్శి నరేష్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.
నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకున్న కలెక్టర్ బసంత్‌కుమార్ దంపతులు










