మదనపల్లె అర్బన్ : మాదినికొండ వద్ద అభివద్ధి చేస్తున్న నగరవనాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని అడిషనల్ పిసిసిఎఫ్ బికె.సింగ్ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం మాదినికొండ రిజర్వులో అభివద్ధి చేస్తున్న నగరవనాన్ని సిసిఎఫ్ నాగేశ్వరరావుతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు నగరవరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నగరవనాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వివిధ అంశాలలో సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు. వారి పరిధిలో అటవీ ప్రాంత సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై కూడా తగు సూచనలు జారీ చేశారు. కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా ఫారెస్ట్ అధికారి వివేక్, పీలేరు ఫ్లయింగ్ స్క్వాడ్ డిఎఫ్‌ఒ ఆశాకిరణ్, రైల్వేకోడూరు సబ్ డిఎఫ్‌ఒ అనురాగ్ మీన, మదనపల్లె రేంజ్ ఆఫీసర్ మదన్ మోహన్‌రెడ్డి, డిఆర్‌ఒలు మదన్ మోహన్, మధుసూదన్, ఎఫ్‌బిఒ ప్రకాష్ హాజరయ్యారు.










