Jan 31,2023 21:07

సౖక్లిస్టుతో మాట్లాడుతున్న కలెక్టర్‌

సౖక్లిస్టుతో మాట్లాడుతున్న కలెక్టర్‌
నగరానికి చేరుకున్న ఆల్‌ ఇండియా సైకిల్‌ టూరిస్టు
నెల్లూరు:ప్రపంచంలో మహిళలకు భారత దేశం సురక్షితమైన దేశం అనే విషయాన్ని దేశ వ్యాప్తంగా తన సైకిల్‌ యాత్ర ద్వారా ప్రపంచానికి నిరూపించే ప్రయత్నం చేస్తూ నగరానికి చేరుకుంది. ఆల్‌ ఇండియా సైకిల్‌ టూరిస్ట్‌ ఆషా మాల్వియ ను మంగళవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ కె.వి.ఎన్‌. చక్రధర్‌ బాబు ఘనంగా సన్మానించి, ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా సైకిల్‌ టూరిస్ట్‌ ఆషా మాల్వియ మాట్లాడుతూ తన తల్లి రాజు బాయి ప్రోత్సాహంతో పీజీ పూర్తి చేసుకొని నేషనల్‌ ప్లేయర్‌ మౌంట్‌ నీరింగ్‌ గా ఉంటూ వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ అట్‌ మౌంట్‌ నీరింగ్‌ సొంతం చేసుకున్నామన్నారు. ప్రపంచంలో మహిళలకు భారత దేశం సురక్షితమైన దేశం అనే విషయాన్ని దేశ వ్యాప్తంగా తన సైకిల్‌ యాత్ర ద్వారా నిరూపించే ప్రయత్నంలో భాగంగా 2022, నవంబర్‌ 1వ తేదీన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని బోపాల్‌ నుండి తన సైకిల్‌ యాత్రను ప్రారంభించినట్లు తెలిపారు.
ఇప్పటి వరకు మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, రాష్ట్రాల్లో తన సైకిల్‌ యాత్రను చేసి 8300 కిలో మీటర్ల మేర ప్రయాణించడం జరిగిందని ఆమె కలెక్టర్‌ కు వివరించారు. 25 వేల కిలో మీటర్ల మేర సైకిల్‌ యాత్ర చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకోవడం జరిగిందని, 2023, ఆగష్టు 15 న డిల్లీకి చేరుకోవడంతో నా సైకిల్‌ యాత్ర పూర్తి అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హరిత టూరిజం హౌటల్‌ డివిజనల్‌ మేనేజర్‌ శివా రెడ్డి, సుపర్‌వైజర్‌ ప్రతాప్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.