Apr 16,2023 21:28

నెత్తురోడినా రహదారులు

అన్నమయ్య జిల్లాలో నలుగురు...
ప్రజాశక్తి-రామాపురం
కర్నూలు - చిత్తూరు 40 వ జాతీయ రహ దారిలోని రామాపురం మండలం పెట్రోల్‌ బంక్‌ సమీపంలో శనివారం అర్ధ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కార్లు ఢకొీని నలుగురు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. కడప జిల్లా బద్వేల్‌ పట ్టణానికి చెందిన నరసయ్య (47), లక్ష్మమ్మ (65), చిన్నక్క (60), రాజారెడ్డి (35), హర్షవర్ధన్‌ కారులో వైద్యం కోసం చిత్తూరు జిల్లా విరూపాక్షపురానికి బయలు దేరారు. రామాపురం మండలం నల్లగుట్టపల్లి పంచాయతీ కొత్తపల్లి క్రాస్‌ వద్ద పెట్రోల్‌ బంక్‌ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న మరో కారు వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢకొీంది. ప్రమాదంలో లక్ష్మమ్మతోపాటు కుమారుడు నరసయ్య, కారు డ్రైవర్‌ రాజారెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కడప రిమ్స్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. వీరిలో చిన్నక్క చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున మృతిచెందారు. లక్ష్ముమ్మకు పక్షవాతం ఉండడంతో వైద్యం కోసం చిత్తూరు జిల్లాకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మరో కారులో ప్రయాణిస్తున్న గుజ్జల వెంకట నాగేంద్ర వరప్రసాద్‌, తన భార్య, కుమార్తెలకు తీవ్ర గా యాలయ్యాయి. విషయం తెలుసుకున్న వెంటనే అన్నమయ్య జిల్లా ఎస్‌పి గంగాధర్‌రావు, ఎఎస్‌పి రాజకమల్‌, డిఎస్‌పి శ్రీధర్‌, సం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రమాదంపై సిఐ వరప్రసాద్‌, రామాపురం ఎస్‌ఐ కొండారెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
వైఎస్‌ఆర్‌ జిల్లాలో ముగ్గురు యువకులు
ప్రజాశక్తి- చెన్నూరు
కడప పట్టణ శివారులోని రాజంపేట-కడప బైపాస్‌ రోడ్డు వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నూరు మండల పరిధిలోని పాలెంపల్లె వద్ద ఆదివారం తెల్లవారుజామున బైక్‌ను లారీ వేగంగా ఢకొీట్టడంతో ముగ్గురు యువకులు మృతిచెందారు. వివరాలు.. చెన్నూరు బెస్తకాలనీకి చెందిన బేస్తకాలనీకి చెందిన వర్దనపోయిన వెంకటేశ్వర్లు, సుబ్బమ్మ కుమారుడు సురేష్‌ (23), రమణ, నాగమ్మ కుమారుడు దినేష్‌ (26), వెంకటరమణ, రమాదేవి కుమారుడు సుబ్బయ్య (19) అనే యువకులు ఆదివారం ఉదయం ఒం టిమిట్టలో గంగమ్మ జాతరను చూసుకుని బైక్‌పై స్వగ్రామానికి తిరుగు ప్రయా ణమయ్యారు. కడప పట్టణ శివారులోని రాజంపేట-కడప బైపాస్‌ రోడ్డు వద్దకు రాగానే హైదరాబాద్‌ నుంచి చెన్నైకి వస్తున్న లారీ వేగంగా ఢకొీంది. ప్రమా దంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతిచెందారు. వీరి ముగ్గరి తల్లిదండ్రులు చేపల వేటకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరాతీస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌ ప్రభుత్వాస్పత్రి తరలించారు. కమలాపురం ఎమ్మెల్యే పి. రవింద్రనాధరెడ్డి, ఎంపిపి చీర్ల సురేష్‌యాదవ్‌, కమలాపురం టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పుత్తా నరసింహారెడ్డి కడప రిమ్స్‌కు వెళ్లి మృతదేహాలకు నివాళుర్పించి కుటుంబ సభ్యులు ఓదార్చారు. ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో చెన్నూరు బెస్తకాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.