Nov 14,2023 21:02

ట్రయల్ రన్‌ను పరిశీలిస్తున్న వైసిపి నాయకులు

ప్రజాశక్తి - కోసిగి
మండల ప్రజల తాగునీటి నెరవేరనుంది. 2019 సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, వై.ధరణీరెడ్డి నీటి సమస్య పరిష్కారంపై కోసిగి వాసులకు హామీఇచ్చారు. గెలిచాక ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డితో చర్చించి దాదాపు రూ.6 కోట్ల నిధులు రాబట్టారు. మొదటి ప్రయత్నంలోనే దాదాపు 6 కిలోమీటర్ల మేర పైపులైన్‌ పనులను చేపట్టారు. అటు నాకన్న చెరువు నుంచి సాగునీరు, ఇటు బుగేని చెరువుకు తాగునీరందించే ట్రయల్‌ రన్‌ను మండల నాయకులతో కలిసి వైసిపి మండల ఇన్‌ఛార్జీ పి.మురళీ మోహన్‌ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ట్రయల్‌ రన్‌ విజయవంతం కావడంతో కోసిగి ప్రాంత వాసుల కల నెరవేరనుందని నాయకులు పేర్కొన్నారు.