- లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వర రెడ్డి
ప్రజాశక్తి-పీలేరు : ఈ ఏడాది మార్చి చివరిలోగా మంజూరైన రుణాలను లబ్ధిదారులకు చెల్లించి లక్ష్యాలు పూర్తి చేయాలని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. మంగళవారం పీలేరు ఎంపిడిఓ కార్యాలయంలో జరిగిన బ్యాంకర్ల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందఠంగా లీడ్ బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ బ్యాంక్ మేనేజర్లు తమకిచ్చిన రుణాల లక్ష్యాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందని అన్నారు. విద్య, వ్యాపార, గృహ నిర్మాణ, కార్ల కొనుగోళ్ల కోసం కూడా రుణాలను మంజూరు చేయాలని చెప్పారు. డి.ఆర్.డి.ఎ డిపిఎం లక్ష్మీప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 10,05,064 స్వయం సహాయక సంఘాలకు రూ.830.98 కోట్ల బ్యాంక్ లింకేజ్ రుణాల పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.733.52 కోట్లు రుణాలుగా అందించినట్లు చెప్పారు. సమావేశంలో పీలేరు ఎంపిడిఓ మురళీమోహన్ రెడ్డి, పీలేరు భారతీయ స్టేట్ బ్యాంక్ మేనేజర్ వెంకటేష్, వెలుగు ఏపిఎం లక్ష్మణ్‌రెడ్డి పాల్గొన్నారు.










