ప్రజాశక్తి - ఎడ్యుకేషన్ : నేత్రదానం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ పి.రాజబాబు అన్నారు. తాడిగడపలోని ఎల్‌వి ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ నందు నేత్రదాన వారోత్సవాలలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న కలెక్టర్ రాజబాబు మాట్లాడుతూ నేత్రదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. మరణించిన తరువాత నేత్రాలు మరొకరికి చూపును ప్రసాదించవచ్చని అన్నారు. నేత్రదానం పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఎల్‌వి ప్రసాద్‌ఐ ఇనిస్టిట్యూట్ సంస్థ వివిధ కార్యక్రమాలను నిర్వహించడం పట్ల అభినందించారు. అలాగే నేత్రదానంపై విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించగా విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందచేశారు. ఎల్‌వి ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ అధిపతి డాక్టర్ అరవింద్ రారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు 25 నుండి సెప్టెంబరు 8వ తేదీ వరకు నేత్రదాన ప్రచార పక్షోత్సవాలను నిర్వహిస్తారన్నారు. ముఖ్యంగా నేత్రదానం పట్ల అవగాహన కల్పించడంతో పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారని తెలిపారు. ఈకార్యక్రమంలో పలువురు వైద్యులు, స్థానికులు పాల్దొన్నారు










