Jun 01,2023 21:14

నేటి నుంచి 'పది' సప్లిమెంటరీ పరీక్షలు

రాయచోటి : అన్నమయ్య జిల్లాలో శుక్రవారం నుంచి 10వ తేదీ వరకు జరిగే సప్లిమెంటరీ పదవ తరగతి పరీక్షలకు జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గలో పది పరీక్షలకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 14,723 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష ఉదయం ఉదయం 9:30 గంటల నుండి 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు 30 నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైన విద్యార్థులను అనుమతించమని అధికారులు చెబుతున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంది. పరీక్ష సెంటర్ల వద్ద జిరాక్స్‌ షాపులు కూడా మూసివేస్తున్నారు. పరీక్ష కేంద్రాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్లేయింగ్‌ సబ్‌ స్క్వాడ్‌, సిట్టింగ్స్‌ హెచ్‌పిసిస్క్‌, ఇన్విజిలేటర్లును ఏర్పాటు చేశారు.
పకడ్బందీగా పరీక్షలు
శుక్రవారం నుంచి జరిగే పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోమన్నారు. ఎక్కడ కూడా మాస్‌ కాపీ జరగకుండా సిసి కెమెరా నిఘాలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. సెంటర్ల వద్ద విద్యార్థుల కోసం ఎఎన్‌ఎంలను నియమించాం. విద్యార్థులు కోసం సెంటర్ల వద్ద మౌలిక వసతులు ఏర్పాట్లు పూర్తి చేశాం. పది పరీక్షలు పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. సెంటర్ల వద్ద ఒకటి 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. ఎవరైనా అవాంఛనీయ సంగతులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.
- పురుషోత్తం, డిఇఒ, అన్నమయ్య జిల్లా.పరీక్ష రాస్తున్న విద్యార్థులు (ఫైల్‌ఫొటో)