Nov 02,2023 22:15

ప్రజాశక్తి-రామచంద్రపురం
డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో అంగన్‌వాడీల మొట్టమొదటి మహాసభలు నవంబర్‌ 3,4, తేదీల్లో జరుగుతాయని సిఐటియు జిల్లా కార్యదర్శి నూకల బలరాం పేర్కొన్నారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం మహాసభల పోస్టర్‌ లను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీల రాష్ట్ర సభ్యురాలు కె.కృష్ణవేణి మాట్లాడారు. మహాసభల్లో అంగనవాడీ సమస్యల మీద చర్చిస్తామని అన్నారు. కొత్త కమిటీ ఎన్నిక జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి దుర్గమ్మ, సిఐటియు జిల్లా కార్యదర్శి నూకల బలరాం, అంగన్‌వాడీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.