హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మనవడు, కెటిఆర్ కొడుకు హిమాన్షు తానెప్పటికీ రాజకీయాల్లోకి రానని ట్వీట్ ద్వారా తెలిపారు. తనకు రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి లేదని.. తనకు వేరే కల ఉందని.. దాన్ని సాధించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 'ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలచుకున్నాను. నేను ఎప్పటికీ రాజకీయాల్లోకి రాను. నా లక్ష్యాలు.. నేను సాధించాల్సినవి చాలా ఉన్నాయి' అని హిమాన్షు మంగళవారం ట్వీట్ చేశారు. రాజకీయ వారసత్వం ఉన్న హిమాన్షు.. రాజకీయాల్లోకి అడుగుపెట్టను అని ఖరాఖండిగా చెప్పడంతో.. తాను చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సామాజిక సేవల్లో చురుగ్గా పాల్గొనే హిమాన్షుకు ఇటీవలే డయానా అవార్డు వరించిన విషయం తెలిసిందే.












