వేంపల్లె : ఆంధ్రప్రదేశ్ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జెయుకెటి) ఆధ్వర్యంలో 2023-24 విద్యాసంవత్సరానికి ట్రిపుల్ ఐటిలలో ప్రవేశాలకు ఈనెల 3న విడుదల చేయనున్నట్లు ఆర్‌జెయుకెటి అధికారులు తెలిపారు. ఈనెల 4 నుంచి 26న 5గంటల వరకు ఏదైనా ఎపి ఆన్‌లైన్ కేంద్రా ల ద్వారా అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. ప్రత్యేక కేటగిరీ వికలాంగ, ఎన్‌సిసి, స్పోర్ట్స్‌కు చెందిన విద్యార్థులకు జులై 5 నుంచి 9 వరకు నూజివీడు క్యాంపస్‌లో సర్టిఫికెట్లు పరిశీలన ఉంటు ందన్నారు. విద్యార్థులకు సీటు కేటాయించే ఫలితాలు జులై13 ప్రకటి స్తారని తెలిపారు. ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పొందిన విద్యార్ధులకు సర్టిఫికెట్లను జులై 3వ వారంలో అయా క్యాంపస్‌ల్లో ఉంటాయని పేర్కొన్నారు. తరగతులు ఆగస్టు 1వ వారంలో ప్రారంభమవుతున్నట్లు అధికారులు తెలి పారు. ఆన్‌లైన్‌లో పదోతరగతి పాస్ అయిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. 2022-23 విద్యాసంవత్సరానికి, గవర్నింగ్ కౌన్సిల్ సిఫారసు మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 4 శాతం డిప్రివేషన్ జోడించి 10వ తరగతి మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు నిర్వహి స్తారని తెలిపారు. ఎపిఆర్‌జెయుకెటి పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీలో క్యాంపస్‌లలో ప్రవేశాలకు ప్రతి ఏడాదీ మూడు సార్లు విద్యార్థులకు కౌన్సెలింగ్‌కు పిలుస్తారని, అధికారిక వెబ్‌సైట్ నుంచి కాల్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆయా తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావల్సి ఉంటుందని తెలిపారు. సీట్లు పొందిన విద్యార్ధులకు రెండేళ్ల పియుసి, నాలుగేళ్ల బిటెక్ కోర్సుతో కలిపి మొత్తం ఆరేళ్ల కోర్సులో ప్రవేశాలు పొందుతారన్నారు. ఎపిలో ఉన్న ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం, నూజివీడు ట్రిపుల్ ఐటి క్యాంపస్ ల్లో 4000 వేల సీట్లు ఉన్నాయని తెలిపారు. ప్రతి క్యాంపస్‌కు 1000 సీట్లు కేటాయించారని, అలాగే ఈడబ్యుఎస్ అభ్యర్థులకు 10 శాతం, అలాగే ప్రతి క్యాంపస్‌కు అదనంగా 100 సూపర్ న్యూమరీ సీట్లు ఉన్నాయన్నారు. ఇందులో 85 శాతం సీట్లు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు, 15శాతం ఓపెన్ మెరిట్ (ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండింటికీ) రిజర్వ్ చేయబడ్డాయని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ నియమావళిని అనుసరించి 10వ తరగతి మెరిట్ ఆధా రంగా సీట్లు కేటాయిస్తారన్నారు. జనరల్ సైన్స్, ఇంగ్లీషు, సోషల్ స్టడీస్‌లో ఎక్కువ మార్కులను చూస్తారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు 5 శాతం సూపర్ న్యూమరి సీట్లు అందుబాటులో ఉన్నాయని, అటువంటి అభ్యర్థులకు ట్యూషన్ ఫీజు కింద ఏడాదికి రూ1,50,000 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.










