నేడు తిరుపతిలో ఖాది ఫెస్ట్ ప్రారంభం
ఖాదీ ఉత్పత్తులను ఆదరించండి: సీఈఓ
ప్రజాశక్తి-తిరుపతి (మంగళం): దేశ వ్యాప్తంగా ఖాదీ ఉత్ప త్తులను పెంచా లని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఖాదీ విలేజర్స్ బోర్డును ఏర్పాటు చేసింద ని, ఖాదీ వారోత్స వా లను ఆయా రాష్ట్ర ప్రభుత్వా లు నిర్వహిం చాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు సోమవా రం తిరుపతిలోని ఎస్‌ఆర్ కన్వెన్షన్ హాల్ (పాత వెంకటేశ్వర థియేటర్) లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరాథ్ చేతులు మీదుగా ఖాదీ ఫెస్ట్- 2023ను ప్రారంభించనున్నారని ఖాదీ విలేజ్ ఇండిస్టీస్ సీఈవో విఆర్ విజయ రాఘవ నాయక్ తెలిపారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 30 నుండి నవంబర్ 8వ తేదీ వరకు ఈ ఖాదీ ఫెస్ట్ నిర్వహిస్తారని ఇందులో 30 ఖాది, పీఎంఈజీపి, ఆర్‌ఇజిపి యూనిట్లు, 6 హ్యాండ్లూమ్, 6 హ్యాండీక్రాఫ్ట్స్ స్టాల్ ద్వారా కోటి రూపాయల వ్యాపారం జరగాలని అంచనాతో ఈ ఫెస్ట్ నిర్వహిస్తున్నామన్నారు. దేశీయ ఉత్పత్తులను వినియోగించాలని 1917లో మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమం వేదికగా ఈ ఖాది ఉత్పత్తిని ప్రారంభించారన్నారు. ఆనాటి నుండి అనేక ఒడిదుడుకుల మధ్య ఖాదీ వినియోగం నేడు అత్యధికంగా పెరిగిందని, దేశీయ అమ్మకాల్లో పరిశీలిస్తే 334 శాతం కాదు అమ్మకాలు నమోదవుతున్నాయన్నారు. మొత్తం క్లాత్ వినియోగం అమ్మకాల్లో 20 శాతం ఖాదీ ఉందన్నారు. ఖాదీ అమ్మకాలు విస్తతంలో భాగంగా కొత్త ఇన్స్ టిట్యూట్ లను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఖాదీ ఉత్పత్తులను ప్రజలు వినియోగించి ఆరోగ్యంగా ఉండా లని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఖాదీ విలేజ్ కమిషన్ బోర్డు కమిషనర్ కోటిరెడ్డి, ఖాదీ విలేజ్ ఇండిస్టీస్ బోర్డు ఉమ్మడి చిత్తూరు జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట్రామ్, డిప్యూటీ డైరెక్టర్ రమేష్ బాబు, ఆర్‌ఎల్‌ఎన్ మూర్తి, రవికుమార్ పాల్గొన్నారు.










