Sep 08,2022 22:33

ప్రజాశక్తి-హెల్త్‌ యూనివర్శిటీ: అత్యున్నత స్థాయి ప్రమాణాలతో వైద్య పరీక్షలను విజయవాడలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు 'టెనెట్‌ డయాగస్టిక్స్‌' సెంటర్‌ను ఈ నెల 9న ప్రారంభించనున్నట్లు టెనెట్‌ డయాగస్టిక్స్‌ సెంటర్‌ చైర్మన్‌ దేవినేని సురేష్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీచరణ్‌ తెలిపారు. మొగల్‌రాజపురంలోని శాంతినగర్‌లోని టెనెట్‌ డయాగస్టిక్స్‌ సెంటర్‌లో గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ తమ వద్ద 3టి ఎంఆర్‌ఐ, సిటి స్కాన్‌, పిఎఫ్‌టి, లేబరేటరీ సర్వీసెస్‌, టిఎంటి, బిఎండి డెక్సా, ఇసిజి, ఇఇజి, 2డి ఎకో, మమ్మోగ్రఫీ, అల్ట్రాసౌండ్‌, వాక్సినేషన్స్‌, ఎక్స్‌రే, సేవలతో పాటు డాక్టర్‌ కన్సల్టేషన్‌, వివిధ రకాలైన హెల్త్‌ ప్యాకేజీలను కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అనుభవజ్ఞులైన రేడియాలజిస్టులు 24 గంటలు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. టెనెట్‌ డయాగస్టిక్స్‌ సేవలను 2017లో ప్రారంభించామని ప్రస్తుతం ఎనిమిది రాష్ట్రాలలో 20 సెంటర్లు ఉన్నాయని తెలిపారు. విజయవాడలో మొదటిసారిగా డ్యూయల్‌ ప్రోబ్‌ ఫైబ్రోస్కాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో టెనెట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి, రేడియాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ సందీప్‌ జువ్వాడి, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ స్మిత, రేడియాలజిస్టు డాక్టర్‌ కావ్య పాల్గొన్నారు.