పీలేరులో లోకేష్ సభకు సాగుతున్న ఏర్పాట్లు
బహిరంగ సభకు సన్నాహాలు
ప్రజాశక్తి-పీలేరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆదివారం పీలేరు చేరుకోనుంది. తమ యువ నేతకు స్వాగతం పలకడానికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఆదివారం సాయంత్రం పీలేరులో నారా లోకేష్ బహిరంగ సభకు భారీ స్థాయిలో జన సమీకరణ చేపట్టి సభను నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లల్లో టిడిపి కుటుంబ సభ్యులు సన్నద్ధమయ్యారు. అనంతరం ఆయన పాదయాత్ర పీలేరు మండలం, వేపులబైలు వరకు సాగనుంది. రాత్రికి ఆయన అక్కడే బస చేయడానికి వీలుగా సన్నాహాలు చేస్తున్నారు.










