Mar 13,2023 21:35

ఫొటో : మాట్లాడుతున్న ఎంపిడిఒ శ్రీనివాసులు

నేడు జాతీయ నులిపురుగుల దినోత్సవం
ప్రజాశక్తి-ఆత్మకూరుఅర్బన్‌ : మండలంలోని అన్ని పాఠశాలలో మంగళవారం జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని జరుపుకోని, సదరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపిడిఒ సి.శ్రీనివాసులు తెలియజేశారు. సోమవారం ఎంపిడిఒ కార్యలయంలో ఏర్పాటు చేసిన సమావేశం ఆయన ప్రసంగిస్తూ ఇప్పటికే అన్ని పాఠశాలలో విద్యార్థులకు తగ్గట్లుగా నులిపురుగుల మందు పంపిణీ చేయాలని తెలిపారు. కావున అందరూ పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలో ఉన్న పాఠశాలలో నోడల్‌ అధికారిని ఏర్పాటు చేశామన్నారు.
కావున వీరి ఆధ్వర్యంలో కార్యక్రమం పూర్తి చేయాలని, అలాగే ఏదైనా అవాంతరం జరిగితే వైద్య అధికారి సలహాలు మేరకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అన్ని రకాల సర్వేలను వెంటనే పూర్తి చేయాలని ఆయన కోరారు. సమావేసంలో అందరూ పంచాయతీ కార్యదర్శులు, వెల్ఫేర్‌ సహాయకులు పాల్గొన్నారు.