Mar 12,2023 21:36

ఏర్పాట్లలో నిమగమైన ఎన్నికల సిబ్బంది

పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీల ఎన్నిక నిర్వహణకు సర్వం సిద్ధ మైంది. ఈమేరకు కడప, అన్నమయ్య జాయింట్‌ కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇందులో భాగంగా కడప జిల్లాలో 762 మంది అధికారులను ఎన్నికల విధులకు నియమించారు. ఆదివారం ఉదయం నుంచి ఎన్నికల సామగ్రిని పోలింగ్‌ కేంద్రాలకు తరలించింది. ఈనేపథ్య ంలో సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్‌ నిర్వహణకు సుమారు నాలుగు వేల మందితో పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ప్రజాశక్తి - కడపప్రతినిధి
పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ఉత్కంఠను కలిగి స్తోంది. గత నెల రోజులుగా అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి మద్దతు దారులకు ధీటుగా పిడిఎఫ్‌, స్వతంత్ర అభ్యర్థుల ప్రచారం నువ్వానేనా అనే రీతిలో ప్రచారం సాగింది. అధికార వైసిపి క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం కలిగి ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా గెలవాలనే లక్ష్యంతో ఓటింగ్‌ పోలరై జేషన్‌ పెంప ుదలకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. దీన్ని ఎదు ర్కొనేందుకు ప్రతిపక్ష టిడిపి, పిడిఎఫ్‌, ఇతర స్వతంత్ర అభ్యర్థులు సిద్ధం కావడం ఉత్కంఠ కారణ మని తెలుస్తోంది. ఇదిలాఉండగా జిల్లా అధికార యంత్రాంగం పశ్చిమ రాయలసీమ ఎన్నికల నిర్వహణకు కడప జిల్లాలోని 36 మండలాల్లో 98 పట్టభద్ర, 38ఉపాధ్యాయులతోకూడిన 131 పోలిం గ్‌ కేంద్రాలు, అన్నమయ్య జిల్లాలోని 30 మం డలాల్లో 51 పట్టభద్ర, 30 ఉపాధ్యాయ పోలింగ్‌ కేంద్రాలను కలిపితే 81 పోలింగ్‌ కేంద్రా లను ఏర్పా టు చేసింది. ఈమేరకు పకడ్బందీగా బందో బస్తు ఏర్పాట్లు చేసింది. ఈనేప థ్యంలో బరిలో నిలిచిన అభ్యర్థులు పోలింగ్‌ కేంద్రా ల్లో ఏజెంట్ల నియా మకంపై దృష్టి సారించారు. పోలింగ్‌ ఏజెం ట్ల దగ్గర నుంచి ఓటింగ్‌ పోల రైజేషన్‌ వరకు వైసిపి, టిడిపి మద్దతుదారుల వ్యూహాలను ఎదుర్కోవడంపై దృష్టి సారించారు. ఈనేపథ్యంలో జిల్లా అధికార యం త్రాంగం ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్‌ నిర్వహణకు కసరత్తు చేసింది. ఈమేరకు ఆదివారం ఉదయం నుంచి పోలింగ్‌ సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని తరలి స్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇందులోభాగంగా కడప జిల్లాలో 762 మందికి రెండు దఫాలుగా శిక్షణ ఇచ్చింది. వీరిలో 540 మంది ఎన్నికల నిర్వహణకు అవసరమని తెలు స్తోంది. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి పిఓ, ఎపిఓ, ఇద్దరు ఓపిఓలతో కూడిన నలుగురు అధికారుల చొప్పున ర్యాండమైజేషన్‌ పద్ధతిలో ఎంపిక చేసింది. ఈలెక్కన 499 మంది అధి కారులను నియమించింది. వీరికితోడు 131 మంది సూక్ష్మ పరిశీలకులను ఏర్పాటు చేసింది. వీరిత ోపాటు 49 పిఓలు, 51 ఎపిఓలు 135 ఓపిఓలను కలిపితే 235 మంది పోలింగ్‌ సిబ్బందిని సిద్ధం చేసింది. వీరితోపాటు మరో 22 మంది సూక్ష్మ పరిశీలకులను రిజ ర్వ్‌లో ఉంచింది. ఇదేతరహాలో అన్నమయ్య జిల్లాలో పోలింగ్‌ కేంద్రానికి నలుగురు చొప్పున 324 మంది పిఓ, ఎపిఓ, ఇద్దరు ఓపిఓ లతో కూడిన సిబ్బందితోపాటు ఐదు శాతం అదనపు రిజర్వ్‌డ్‌ సిబ్బందిని కేటాయించా రు. ఈనేపథ్యంలో పకడ్బందీ పోలింగ్‌ నిర్వహణ నిమిత్తం కడప జిల్లాలో రెండు ఎపిఎస్‌పి పోలీస్‌ బలగాలతో కూడిన రెండు వేల మంది పోలీసు లు, అన్నమయ్య జిల్లాలో ఒక ఎపిఎస్‌పి బలగాలతోపాటు 923 మంది మొత్తం 2923 మంది పోలీసులు పకడ్బందీ బందోబస్తు నిర్వహించనున్నారు.