Oct 27,2023 23:54

నడకదారిలో మళ్లీ చిరుత, ఎలుగు


నడకదారిలో మళ్లీ చిరుత, ఎలుగు


ప్రజాశక్తి- తిరుమల: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో ఈనెల 24 నుంచి 27వ తేదీ మధ్యలో శ్రీ లక్ష్మీ నారాయణస్వామి ఆలయం నుండి రిపీటర్‌ మధ్య ప్రాంతంలో ఒక చిరుత, ఒక ఎలుగుబంటి తిరుగుతున్నట్టుగా కెమెరా ట్రాప్‌లో నమోదు అయ్యిందని, కనుక నడకదారి భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. నడకదారిలో ప్రయాణించే భక్తులు గుంపులు గుంపులుగానే వెళ్లాలని సూచించింది.