నైపుణ్య సామర్థ్యాలు పరిశీలన
ప్రజాశక్తి-ఉదయగిరి : విద్యార్థుల అభ్యసన నైపుణ్య సామర్థ్యాలను మండల విద్యాశాఖ అధికారి షేక్ మస్తాన్ వలీ పరిశీలించారు. శుక్రవారం మండల పరిధిలోని సున్నంవారి చింతల ఎంపిపిఎస్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతుల వారీగా విద్యార్థుల పఠన అభ్యసన నైపుణ్య సామర్థ్యాలను పరిశీలించి నల్లబల్లపై విద్యార్థుల గణిత సామర్థ్యాలను పరిశీలించారు. 4, 5వ తరగతుల విద్యార్థులకు కూడడం, తీసివేయడం, పెంచడం, భాగించడం తప్పనిసరిగా వచ్చి ఉండాలని ఉపాధ్యాయులకు సూచించారు. క్రమం తప్పకుండా ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టుల వర్క్‌బుక్‌లను పూర్తి చేసే విధంగా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థుల, ఉపాధ్యాయుల, మధ్యాహ్న భోజన నిర్వాహకుల, ఆయాల అటెండెన్స్ రిజిస్టర్‌లు, పాఠశాల రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తూ విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. భోజనం రుచి చూచికరంగా ఉండేటట్లు నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.










