నైపుణ్య సామర్థ్యాలు పరిశీలన
ప్రజాశక్తి-ఉదయగిరి : విద్యార్థుల నైపుణ్య సామర్థ్యాలను మండల విద్యాశాఖ అధికారి షేక్ మస్తాన్ వలీ పరిశీలించారు. సోమవారం స్థానిక ఎంపిపి ఎస్ షబ్బీర్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతుల వారీగా విద్యార్థుల నైపుణ్యాలు సామర్థ్యాలను పరిశీలించి ప్రతి విద్యార్థి సబ్జెక్టుల వర్క్ బుక్‌లను పూర్తి చేసే విధంగా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలన్నారు. విద్యార్థులకు తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు బోధనచేయాలని చతుర్విధ ప్రక్రియలలో నైపుణ్యం సాధించే విధంగా పరిసరాలను పరిచయం చేస్తూ నాణ్యతతో కూడిన గుణాత్మక బోధన చేయాలన్నారు. తరగతి గదులు, పాఠశాల చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉండేవిధంగా ప్రధానోపాధ్యాయులు ఆయాకు సూచనలు ఇవ్వాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజన నిర్వాహకుల, ఆయా హాజరు పట్టీలను పరిశీలించి ప్రతిరోజు ఆయా ఉదయం 8 గంటలకు, 11 వరకు మధ్యాహ్నం 1.30 నుండి 3.00 గంటల వరకు ఉంటూ ప్రతిరోజు నాలుగు సార్లు టాయిలెట్లు శుభ్రం చేయాలని ఆయాకు సూచించారు. అలాగే ఎంపిపిఎస్ యాదవపాలెం పాఠశాల రికార్డులను పరిశీలించి ఆయా పాఠశాలలో ఉండి రోజుకు నాలుగు సార్లు టాయిలెట్స్ శుభ్రం చేయాలని వారు సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లియాఖత్, ఉపాధ్యాయులు మున్న పాల్గొన్నారు.










