కడప ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్ప్నతిలోని సూపర్‌స్పెషాలిటీ బ్లాక్ నాసిరకం పనులకు కేరాప్ అడ్రస్‌గా మారింది. నాలుగేళ్ల కిందట నుంచి సూపర్ స్పెషాలిటీ, కేన్సర్ కేర్, సైక్రియాటిక్ బ్లాక్ పనులు చేపట్టింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బిపిఆర్ కన్‌స్ట్రక్షన్ చేపట్టిన సూపర్ స్పెషాలిటీ బ్లాక్ పనుల్లో పాత రిమ్స్ పనుల తరహాలో అంతులేని నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. రూ.272 కోట్ల విలువైన పనుల పర్యవేక్షణను ఎపిఎంఎస్‌ఐడిసి ఇంజినీరింగ్ యంత్రాంగం గాలికి వదిలేసింది. ఫలితంగా బ్లాక్ ముగింపు దశ పనుల్లో భాగమైన ప్లాస్టింగ్ పనుల్ని అంత్యంత నాసి రకంగా చేపట్టడం విస్మయాన్ని కలిగిస్తోంది. బయటికి కనిపించే పనుల్నే ఇంతటి అధ్వానంగా చేపడితే అంతర్గత నిర్మాణ పనుల్ని ఎలా చేపట్టిందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ పనుల్లో నాసిరకం రాజ్యమేలుతోంది. 2019 డిసెంబర్ 23, 24, 25వ తేదీల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజీవ్‌గాంధీ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ కళాశాల ఆవరణంలో రూ.272 కోట్లతో సూపర్ స్పెషాలిటీ, రూ.40.81 కోట్లతో సైక్రియాటిక్, రూ.107 కోట్లతో కేన్సర్ కేర్ బ్లాక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వీటికి అదనంగా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ హెల్త్ కేర్ హాస్పిటల్ బ్లాక్, గైనిక్ బ్లాక్ నిర్మాణ పను లకు గ్రీన్‌సిగల్ లభించిన సంగతి తెలిసిందే. 2019, 2020, 2021 కరోనా వైరస్ విజృభించడంతో సూపర్‌స్పెషాలిటీ, కేన్సర్‌కేర్, సైక్రియాటిక్ సహా మిగిలిన నిర్మాణాల పనులు నిలిచిపోవడం అందరికీ తెలిసిందే. 2021 అనంతరం కరోనా మందగించడంతో సూపర్‌స్పెషాలిటీ బ్లాక్ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి ముగింపు దశకు చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బిపిఆర్ కన్‌స్ట్రక్షన్స్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిర్మాణ పనులు చేపట్టింది. సూపర్‌స్పెషాలిటీ బ్లాక్ నిర్మాణ పనుల్లో అంతర్గత పనుల నాణ్యత ఎలా ఉన్నా బయటి ప్రపంచానికి కనిపించే ప్లాస్టింగ్ వంటి పనుల్లోనైనా నాణ్యతా ప్రమాణాలకు పాటించాలి. కానీ బిపిఆర్ కన్‌స్ట్రక్టన్స్ ఇష్టా రాజ్య ంగా నాణ్యతా ప్రమా ణాలను పాత రేసింది. ఫలితంగా సూపర్‌స్పెషాలిటీ బ్లాక్ ప్లాస్టింగ్ పనుల్ని చూ స్తుంటే విస్మయం, ఆవేదన కలిసిన అనుభవం కలుగు తోంది. ఎపిఎం ఎస్‌ఐడిసి ఇంజి నీరింగ్ నిర్మాణాల పనుల గైడ్‌లెన్స్ ఎలా ఉన్నాయో తెలియదు, కానీ ప్లాస్టింగ్ పనుల్ని చూస్తుంటే నిబంధనలే సిగ్గుతో తలవంచుకునేలా పనుల తీరు కనిపిస్తోంది. ఇసుక, సిమెంట్ మిశ్రమంలో నాణ్యతను గాలికి వది లేసింది. ప్లాస్టింగ్ పనుల్లో ఇసుక డామినేట్ చేస్తున్న దృశ్యం నివ్వెర పరుస్తోంది. ఎపిఎంఎస్‌ఐడిసి ఇంజి నీరింగ్ యంత్రాంగానికి కనిపిం చకపోవడం విశేషం. దీనిపై ఓరిమ్స్ కాంట్రాక్టర్ స్పందిస్తూ బిపిఆర్ కన్‌స్ట్రక్షన్స్ నాణ్యతకు నిదర్శనమని చెబుతూనే కాంట్రాక్టర్ ప్రభుత్వాధినేతలతో సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఎటువంటి స్పందన ఉండే అవకాశం లేదని పేర్కొనడం గమనార్హం. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి ముఖ్యమంత్రి జిల్లాలోని ఇటువంటి నాసిరకం పనులపై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందనడంలో సందేహం లేదు. రాయలసీమ ఆరోగ్య సంరక్షణలో కీలక భూమిక పోషించే రిమ్స్ అప్‌గ్రేడేషన్ పనుల్లో రాబోయే తరాలకు సరిపడా జరుగుతున్న అన్యాయానికి నిదర్శనంగా నాసిరకం మారనుందని చెప్పవచ్చు. దీనిపై ఎపిఎంఎస్‌ఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను ఫోన్‌లో సంప్రదిచే ప్రయత్న చేయగా అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.
నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
సూపర్ స్ఫెషాలిటీ బ్లాక్ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. నెల రోజుల కిందట సూపర్ స్పెషాలిటీ పనుల్లో నాసిరకం పనులను గమనించాం. సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ దృష్టికి నాసిరకం పనుల సమస్యను తీసుకెళ్లినప్పటికీ స్పందన లేదు. దీనిపై పోరాటానికి కసరత్తు చేస్తున్నాం.
- సుబ్బయ్య, మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్.నిర్మాణంలో ఉన్న రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి










