మాట్లాడుతున్న మృతుని బంధువులు
నారాయణలో డయాలసిస్ రోగి మృతి
-ఆందోళనకు దిగిన మృతుడి కుటుంబ సభ్యులు
-సూపరింటిండెంట్‌పై దాడికి యత్నం
నెల్లూరు:కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ వైద్య చికిత్సల నిమిత్తం అరవ మల్లికార్జున (34)అనే వ్యక్తి శనివారం నారాయణ వైద్యశాలలో చేరారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు డయాలసిస్ చేయాలని రోగి బందువులకు తెలియజేశారు. వారి అంగీకారంతో డయాలసిస్ ప్రారంభించారు అదే సమయంలో మరి కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తడంతో కార్డియాక్ అరెస్టు కావడంతో మల్లికార్జున మృతి చెందారు. డయాలసిస్ చేస్తున్న వ్యక్తి మృతి చెందిన సమాచారం తెలుసుకున్న రక్తసంభందీకులు డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తోనే మృతి చెందారని నారాయణ వైద్యశాల ఎదుట బైటాయించి ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న వైద్యశాల సూపరింటిండెంట్ హరిప్రసాద్‌రెడ్డి మృతుని బందువులతో మాట్లాడి వైద్యం చేసే సమయంలో చోటు చేసుకున్న విషయాన్ని వివరించేందుకు గదిలోకి పిలిపించారు. దీంతో ఒక్కసారిగా మృతుడి బందువులు సూపరింటిండెంట్ హరిప్రసాద్‌రెడ్డిపై దాడియత్నం చేశారు. వైద్యశాలలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో నారాయణ వైద్యశాల సూపరింటిండెంట్ డాక్టర్ హరిప్రసాద్‌రెడ్డి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
వైద్యుల, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మరణం సంభవించలేదు
నారాయణ వైద్యశాల సూపరింటిండెంట్ డాక్టర్ హరిప్రసాద్‌రెడ్డి
అరవ మల్లికార్జున అనే 34 సంవత్సరాల వ్యక్తికి తమ వైద్యశాలలో వైద్యులు డయాలసిస్ చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఈ వ్యక్తి కిడ్ని సంబంధిత సమస్యతోపాటు గుండె సంబంధీత సమస్యతో బాదపడుతున్నారని, హెపటైటీస్ వంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారన్నారు. గతంలో కోవిడ్ వ్యాధికి సైతం గురైనట్లు మృతుని బంధువులు తెలియజేశారు. తీవ్రమైన అనారోగ్య సమస్యల కారణంగా డయాలసిస్ చేసే సమయంలో ఇటువంటి ప్రమాదం జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఈ సమాచారం రోగి సంబంధిత బంధువులకు సైతం తెలియజేశాం.










