నారా లోకేష్‌కు స్వాగతం పలుకుతున్న పరిటాల సునీత, శ్రీరామ్, తదితరులు
ప్రజాశక్తి-కనగానపల్లి : రాప్తాడు నియెజకవర్గంలోని చెన్నేకొత్తపల్లి మండలం కోన సమీపంలోకి నారా లోకేష్ పాదయాత్ర చేరుకున్న సందర్భంగా మాజీమంత్రి పరిటాల సునీత, టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు.ఈసందర్భంగా మాజీమంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ నారా లోకేష్ కు పుష్పగుచ్ఛం అందించి ఘనస్వాగతం పలికారు. వీరితో పాటు మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి, హిందూపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు బికె.పార్థసారథి నారా లోకేష్ కు స్వాగతం పలికారు.మహిళలు పెద్ద ఎత్తున కలిశాలతో నారా లోకేష్‌కు స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో టీడీపీ మండల కన్వనర్ యాతం పోతులయ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










