నారాలోకేష్‌కు గజమాలతో స్వాగతం పలుకుతున్న నాయకులు
గోరంట్ల : నారా లోకేష్‌కు మాజీ ఎమ్మెల్యే పార్థసారథి ఘన స్వాగతం పలికారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మండలంలోని గోనివారిపల్లి వద్ద ప్రవేశించింది. ఈ సందర్భంగా బికె. పార్థసారధి గజమాలతో లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనతో పాటు రెడ్డి చెరువు కట్ట వరకు నడిచారు. మలసముద్రం పంచాయతీ సర్పంచి సువర్ణ అశ్వత్ రెడ్డి పూల చెట్లపల్లి వద్ద లోకేష్‌కు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సోమశేఖర్, ప్రధాన కార్యదర్శి అశ్వర్థరెడ్డి, పార్లమెంట్ కార్యదర్శి నరసింహులు, ఎల్‌ఎన్ నారాయణస్వామి, బాలకృష్ణచౌదరి, బాలాజీ, నరేంద్ర, నీలకంఠారెడ్డి తదిరులు పాల్గొన్నారు.










