కక్ కట్ చేస్తున్న మాజీ ఎంయల్‌ఎ దివి శివరాం
ప్రజాశక్తి - కందుకూరు :టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా కందుకూరు టిడిపి కార్యాలయంలో కేక్ కట్ చేసి పార్టీ రాష్ట్ర ్ట కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు దివి శివరాం, ఇతర నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో 120 మంది రోగులను పరామర్శించి పండు అందజేశారు. నియోజకవర్గ టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు సహకారంతో ఇద్దరు పేదలకు ఉచితంగా తోపుడుబండ్లు పంపిణీ చేశారు. పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, లింగసముద్రం మండల పార్టీ అధ్యక్షులు వేముల గోపాల్ రావు, వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం పాల్గొన్నారు.










