May 14,2023 21:06

నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడమే లక్ష్యం

ఓబులవారిపల్లి : రైతులకు నాన్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. మండల పరిధిలోని కొబ్బరివారిపల్లె గ్రామంలో ఆదివారం 33/11కెవి సబ్‌ స్టేషన్‌కు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని రైతులకు, కార్మికులకు, గహాలకు నాణ్యమైన విద్యుత్తు నిరంతర సరఫరా చేయడమే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం సిస్టం ఇంప్రూవ్‌మెంట్‌ స్కీమ్స్‌ ద్వారా మండలంలోని గొబ్బురువారిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న 33/11 కె.వి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎంపిపి తమ్మిద తిరుపాల్‌ మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం ప్రతి పేద రైతుకి న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తుందని, 24 గంటల కరెంటు రైతులకి అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలపారు. తమ గ్రామంలో నూతన సబ్‌స్టేషన్‌ నిర్మించడం సంతోషదాయకంగా ఉందన్నారు. సబ్‌ స్టేషన్‌ కోసం శ్రమించిన స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ మిథున్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎపిటూరిజం డైరెక్టర్‌ సాయికిషోర్‌రెడ్డి, వైసిపి రాష్ట్ర ప్రచార కార్యదర్శి సిడి నాగేంద్ర, మాజీ ఎంపిపి తమ్మిద తిరుపాలు, జడ్‌పిటిసి లక్ష్మి నరసయ్య, జిల్లా టూరిజం డైరెక్టర్‌ సుధాకర్‌ రాజు, సుబ్బారెడ్డి, నారాయ ణరెడ్డి, పాపిరెడ్డి, విద్యుత్‌ ఎస్‌ఇ చంద్రశేఖర్‌, కాంట్రాక్టర్‌ యశ్వంత్‌రెడ్డి వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.