ప్రజాశక్తి- రాయచోటి
జిల్లాలో నాణ్యమైన రోడ్లు వేయడమే తమ లక్ష్యమని ఆర్‌అండ్‌బి ఎస్‌సి వై. సహదేవరెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో రోడ్లు ఎలా వేయ్యాలో ప్రజాశక్తికి ఇచ్చిన ముఖాముఖిలో ఆయన వివరించారు.
అన్నమయ్య జిల్లాలో ఇఇ, డిఇ, జెఇ వివరాలు తెలపండి?
జిల్లా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా రాజ ంపేట, మదనపల్లె ప్రాంతాలలో ఇఇ కార్యాల యాలున్నాయి. రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు, మదనపల్లి, పీలేరు నియోజకవర్గాలలో డిఇ కార్యా లయాలున్నాయి. జెఇలు తొమ్మిది మంది ఉన్నారు.
జిల్లాలో ప్రస్తుతం ఎక్కడ పనులు జరుగుతున్నాయి? బడ్జెట్ ఎంత?
ప్రస్తుతం రాజంపేట డివిజన్ పరిధిలో పనులు జరుగుతున్నాయి. వైఎస్‌ఆర్ జిల్లాలోని కోడూరు నుంచి సి. కమ్మపల్లి వయా రెడ్డివారిపల్లె, చెయ్యవరం రహదారి కి 0/4 కిలో మీటర్ల వరకు హై లెవెల్ వంతెన నిర్మాణం రూ. 1200 లక్షలతో పనులు జరుగుతున్నాయి. వైఎస్‌ఆర్ జిల్లాలోని చిట్వేల్ మండలంలో చిట్వేలి-పుల్లంపేట రోడ్డు 0/0 నుంచి 10/8 నుంచి 16/2 వరకు రోడ్డుకు ప్రత్యేక మరమ్మతులు కోసం రూ. 180.00లక్షలతో పనులు జరుగుతున్నాయి. స్థానిక వాగుమీదుగా నూలివీ డు- పందికుంట - కొర్లకుంట రహదారి 313 కిలోమీటర్లు 7/ 0-2 వద్ద మైనర్ వంతెన 3 వి ఎక్స్ 4.00 ఎంటిఎస్ పునర్మాణం కోసం రూ. 61.00 లక్షల తో పనులు త్వరలో ప్రారంభిస్తాం. రాజంపేట - కదిరి- తుంకూర్ రోడ్డు ఎస్ హెచ్ 59 రాయచోటి పట్టణ పరిమితులు కిలోమీటర్ 52/400 నుండి 56/00 వరకు సిసి డే రియన్‌లను అందించడంతోపాటు రోడ్డు కోసం రూ.1600.00 లక్షలతో పనులు జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో బి.కొత్తకోట- బి రంగీ రహదారిని 0/800 నుండి/643 వరకు రూ. 23.00లక్షల తో పనులు జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో బుర్లపల్లె -సదుం- చెన్న రాయుని పల్లె రహదారి కిలోమీటర్ 0/000 నుండి 18/300 వరకు మెరుగుదలు వర్కింగ్ రీచ్ 8/300 నుండి 18/300 కిలో మీటర్ల వరకు రూ. 2500.00లక్షలతో పనులు జరుగుచున్నాయి . అన్నమయ్య జిల్లాలో జాతీయ అభివద్ధి బ్యాంక్ స్కీం కింద రాయచోటి -సుండుపల్లె -పింఛా రహదారులు , రాజంపేట -కదిరి- తుంకూర్ రహదారిలు , చిన్న మండెం -సంబేపల్లి రహదారులు , నిమ్మనపల్లె - వాయల్పాడు -గుర్రంకొండ- గాలివీడు రహదారుల వెడల్పు కోసం రూ.10542.00లక్షల తో పనులు జరుగుతున్నాయి. జిల్లాలో సిఆర్‌ఎ రోడ్డు నుండి వై కోట రోడ్డు కి.మీ .0/0 నుండి 12/0 వరకు ఎఆర్ పేట ఆర్‌ఎస్ కొర్లకుంట, చెన్నరాజుపోడు మీదుగా రహదారి రహదారుల మరమ్మతుల కోసం రూ. 200.00 లక్షలతో పనులు పూర్తయ్యాయి.
జిల్లా కేంద్రంలో రింగ్ రోడ్డు మరమ్మతులు ఎప్పుడు పూర్తి చేస్తారు?
జిల్లా కేంద్రంలోని రాయచోటి రింగ్ రోడ్డు 2009 వ సంవత్సరంలో మంజూరైంది. నిర్మాణ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. మదనపల్లి రింగ్ రోడ్ సర్కిల్, చెన్న ముక్క పల్లె వద్ద కొంత నిర్మాణ పనులు కొంత పెండింగ్ ఉన్నాయి . బాధితులు కోర్టులో వేసి ఉన్నారు. సమస్యలు పరిష్కారం అవ్వగానే త్వరలో పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.
గత సంవత్సరం తుఫాన్ కారణంగా దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు జరుగుతున్నాయా?
గత సంవత్సరం తుఫాను కారణంగా దెబ్బ తిన్న రహదారులకు రూ.888.02 లక్షల బడ్జెట్ తో నిర్మాణ పనులు పూర్తి అయినాయి. ఈ ఏడాది కొత్త బడ్జెట్ రహదారులకు ఇంకా రాలేదు. త్వరలో బడ్జెట్ కేటాయిస్తారు. వెంటనే రహదారి నిర్మించడానికి చర్యలు తీసుకుంటాం.










